Flipkart iPhone offer: iPhone 17 లాంచ్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 16 Pro, Pro Max ధరలు గణనీయంగా తగ్గింపు!
ఆపిల్ నూతనమైన ఐఫోన్ 17 సిరీస్ విడుదలకు సమీపిస్తున్న వేళ, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
Flipkart iPhone offer: iPhone 17 లాంచ్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 16 Pro, Pro Max ధరలు గణనీయంగా తగ్గింపు!
Flipkart iPhone offer: ఆపిల్ నూతనమైన ఐఫోన్ 17 సిరీస్ విడుదలకు సమీపిస్తున్న వేళ, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. గత సెప్టెంబర్ 2024లో ఆవిష్కరించిన ఈ ప్రీమియం ఫోన్లు ఇప్పుడు తగ్గించిన ధరలతో, పలు ఆకర్షణీయ ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో (128GB) మోడల్ ₹1,19,900 ప్రస్తుత ధర నుంచి ₹1,09,900కి తగ్గించబడింది. అలాగే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256GB), దీని ప్రారంభ ధర ₹1,44,900 కాగా ఇప్పుడు ₹1,32,900కి లభిస్తోంది. దీతో పాటు ఇతర స్టోరేజ్ వేరియంట్లపై కూడా తగ్గింపు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ డీల్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసినవారికి అదనంగా ₹4,000 డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. పలు కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, వినియోగదారులు తమ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకొని కొత్త ఐఫోన్ కొనుగోలుపై అదనపు తగ్గింపును పొందవచ్చు.
2025 మధ్యలో కూడా ఐఫోన్ 16 ప్రో సిరీస్ టాప్ పర్ఫామెన్స్, ఉత్తమ కెమెరాలు, దీర్ఘకాలిక బ్యాటరీ, అలాగే ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఐఫోన్ 14 లేదా అంతకంటే పాత మోడళ్లను ఉపయోగిస్తున్నవారికి ఇది అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మంచి అవకాశంగా భావించవచ్చు.
అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో లేదా ప్రో మ్యాక్స్ వాడుతున్నవారు, లేదా పూర్తిగా తాజా ఫీచర్లు, చిప్‌సెట్‌లు, మెరుగైన కెమెరాలు వంటి అంశాల కోసం ఎదురు చూస్తున్నవారు సెప్టెంబర్ 2025లో రానున్న ఐఫోన్ 17 సిరీస్ విడుదల కోసం వేచి చూడటం ఉత్తమంగా భావించవచ్చు