iPhone 16 Plus: తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్లస్.. ఇప్పుడే కొనేయండి..!

పాత ఏడాది చివరిలోనే కాదు.. కొత్త ఏడాది ప్రారంభంలోనూ వినియోదారులను ఆకట్టుకులేనా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

Update: 2026-01-09 14:00 GMT

iPhone 16 Plus: తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్లస్.. ఇప్పుడే కొనేయండి..!

iPhone 16 Plus: పాత ఏడాది చివరిలోనే కాదు.. కొత్త ఏడాది ప్రారంభంలోనూ వినియోదారులను ఆకట్టుకులేనా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో iPhone 16 Plusపై ఎవరూ ఊహించని విధంగా భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. నిజంగా టెక్ ప్రియులకు దీనిని గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 ఉండగా.. విజయ్ సేల్స్ ఆఫర్ ద్వారా కేవలం రూ.69,490కే లభిస్తోంది. అంటే.. యాపిల్ బ్రాండ్ మీద ఏకంగా రూ.20,410 వరకు ఆదా చేసుకోవచ్చన్న మాట. దీని మీద మరింత ఆఫర్ పొందాలంటే.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ICICI, Axis బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ఫోన్‌ను కొంటే.. రూ. 5వేల వరకు, HDFC కార్డులపై కొంటే రూ.3,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదంటే EMI ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే.. రూ.3,015 నుండి ప్రారంభమవుతుంది.

ఇక iPhone 16 Plus పెర్ఫార్మెన్స్ విషయంలో.. దీనిలో ఉన్న లేటెస్ట్ యాపిల్ A18 చిప్‌సెట్, 6-కోర్ CPU, 5-కోర్ GPU కాంబినేషన్ వినియోదారులను మరో కొత్త లోకానికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం కీలకంగా మారిన కృత్రిమ మేధ(AI) టాస్క్‌లను చిటికెలో పూర్తి చేయడానికి ఈ ఫోన్‌లో 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ను సెట్ చేశారు. ఐఫోన్ 16 ప్లస్.. 8GB RAMతో పాటు Wi-Fi 7, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లను కలిగి ఉండటంతో.. 2026 ఏడాదంతా కూడా ఈ ఫోన్ ఎక్కడా తగ్గకుండా బీస్ట్ మాదిరి పనిచేస్తుంది. అలాగే హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసేవారికి iPhone 16 Plus పర్ఫెక్ట్ ఛాయిస్.

ఇకపోతే ఈ ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ యొక్క డిజైన్, డిస్‌ప్లే చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. దీనిలో ఉన్న 6.7 అంగుళాల భారీ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఎండలోనూ చాలా స్పష్టంగా కనిపించేలా 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఇస్తుంది. అలాగే సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, ప్రీమియం అల్యూమినియం ఫినిషింగ్‌తో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నుండి పూర్తి రక్షణ పొందుతుంది. యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్ ఈ ఫోన్‌‌ను మరింత స్మార్ట్‌గా నిలబెడుతాయి.

ఈ iPhone 16 Plus ఫోన్ వెనుక వైపు ఉన్న 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సల్ అల్ట్రా‌వైడ్ లెన్స్‌.. ప్రొఫెష్నల్ క్వాలిటీ ఫొటోలు తీస్తుంది. దీనిలోని 2x ఆప్టికల్ జూమ్ ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా అద్భుతమైన షాట్స్ అందిస్తుంది. అంతేకాదు.. దీనిలో ఉన్న స్పేషియల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ మీ మెమరీస్‌ను మరింత సహజంగా రికార్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తక్కువ లైటింగ్‌లో కూడా ఎలాంటి నాయిస్ లేకుండా క్లారిటీగా ఫొటోలు తీయడంలో ఎక్స్‌పర్ట్.

ఐఫోన్ 16 ప్లస్.. 4674mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. అయితే దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. సుమారు 27 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు కొత్త మ్యాగ్‌సేఫ్ టెక్నాలజీ ద్వారా 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్.. అదిరిపోయే కెమెరా, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకునే వాళ్లు ప్రస్తుతం విజయ్ సేల్స్ నిర్వహిస్తున్న ఈ డీల్‌ను అస్సలు మిస్ చేసుకోకూడదు.

Tags:    

Similar News