iPhone 15 Price Cut: ఐఫోన్ 15పై సూపర్ డిస్కౌంట్.. మంచి ఆఫర్ మళ్లీ దొరకదేమో.. ఇక లేట్ చేయకండి బ్రో..!
iPhone 15 Price Cut: గత సంవత్సరం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ఐఫోన్ 15 నిలిచింది.
iPhone 15 Price Cut: ఐఫోన్ 15పై సూపర్ డిస్కౌంట్.. మంచి ఆఫర్ మళ్లీ దొరకదేమో.. ఇక లేట్ చేయకండి బ్రో..!
iPhone 15 Price Cut: గత సంవత్సరం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ఐఫోన్ 15 నిలిచింది. ఒకరు కాదు ఇద్దరు పరిశోధకుల నివేదిక ప్రకారం.. యాపిల్ ఈ ఐఫోన్ 2024 లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. మీరు కూడా ఈ బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌ను బంపర్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయాలనుకుంటే, ఈ వార్త మీ కోసమే. రూ. 10,200 తగ్గింపుతో ఐఫోన్ 15 ఆర్డర్ చేయచ్చు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎటువంటి ఆఫర్లు ఉన్నాయి? ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
iPhone 15 Offers
ఐఫోన్ 15 ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో కేవలం రూ.59,700కే లభిస్తుంది. ఈ ఫోన్ రూ.69,900కి లాంచ్ అయింది, ఇప్పుడు రూ.10,200 డైరెక్ట్ డిస్కౌంట్ తర్వాత రూ.59,700కి అమ్ముడవుతోంది. ఇది కాకుండా, మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ. 1,700 కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలానే పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే ఫోన్ పరిస్థితి, మోడల్‌ను బట్టి రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందచ్చు. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఇప్పటికీ రూ.69,900కి అమ్ముడవుతోంది.
iPhone 15 Specifications
ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది, ఇది అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, శక్తివంతమైన కలర్స్ అందిస్తుంది. ఈ ఫోన్ పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది, ఇది పగటిపూట, తక్కువ కాంతి, పోర్ట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది.
ఈ యాపిల్ మొబైల్ A16 బయోనిక్ చిప్‌పై పనిచేస్తుంది. ఇది వేగవంతమైన, మృదువైన పనితీరును అందిస్తుంది. పవర్ కోసం ఈ ఫోన్‌లో 3,349mAh బ్యాటరీ ఉంది, కానీ ఛార్జర్ లేకుండా వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ, iOS 17 ఇందులో అందించారు. ఇది వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.