Washing Machine Tips: వాషింగ్‌ మెషిన్‌ని ఎప్పుడు ఇక్కడ ఉంచవద్దు.. భారీగా నష్టపోతారు జాగ్రత్త..!

Washing Machine Tips: ఈ రోజుల్లో టీవీ, ఫ్రిజ్‌లాగే వాషింగ్ మెషీన్‌ కూడా ముఖ్యమైన వస్తువుగా మారింది.

Update: 2023-05-19 08:15 GMT

Washing Machine Tips: వాషింగ్‌ మెషిన్‌ని ఎప్పుడు ఇక్కడ ఉంచవద్దు.. భారీగా నష్టపోతారు జాగ్రత్త..!

Washing Machine Tips: ఈ రోజుల్లో టీవీ, ఫ్రిజ్‌లాగే వాషింగ్ మెషీన్‌ కూడా ముఖ్యమైన వస్తువుగా మారింది. ఇంట్లో ఎప్పుడైతే వాషింగ్ మెషీన్ చెడిపోతుందో అప్పుడు ఆడవాళ్ల కష్టాలు మరింత పెరుగుతాయి. వాస్తవానికి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల మాదిరిగానే వాషింగ్ మెషీన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అది పాడవడానికి ఎక్కువ సమయం పట్టదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయడానికి ముందే దానికోసం ఇంట్లో ఒక ప్రత్యేక స్థలం కేటాయించాలి.

నిజానికి వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఇలాంటి సమయంలో అది ఉంచిన స్థలం గట్టిగా లేకపోతే వైబ్రేషన్‌ కారణంగా మెషిన్‌ పార్ట్స్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పరికరాలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే చాలామంది వాషింగ్ మెషీన్‌ని వాష్‌రూమ్‌లో పెడుతారు. పొరపాటున కూడా ఇలా చేయకూడదు. దీనివల్ల అది ఎప్పుడు తడిగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు జారే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ కారణాల వల్ల అది తొందరగా పాడైపోతుంది.

వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికినప్పుడల్లా మెషీన్‌ని పూర్తిగా తనిఖీ చేయండి. దుస్తుల పాకెట్స్‌లో ఏదైనా సేఫ్టీ పిన్, నాణెం లేదా ఏదైనా పదునైన వస్తువు ఉండటం వల్ల బట్టలు పాడవుతాయి. అంతేకాదు వాషింగ్ మెషీన్ భాగాలు దెబ్బతింటాయి. వాషింగ్ మెషీన్‌ను దాని సామర్థ్యం ప్రకారం ఉపయోగించాలి. మెషీన్‌ను పూర్తిగా బట్టలతో నింపే బదులు సగం బట్టలను మాత్రమే వేయాలి. తద్వారా యంత్రం తిరగడం సులభం అవుతుంది. అంతేకాదు దుస్తులను సరిగ్గా శుభ్రం చేస్తుంది. మెషిన్‌లో ఒకేసారి ఎక్కువ బట్టలు వేయడం వల్ల అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News