Honor X6d: హానర్ నుంచి అదిరిపోయే బడ్జెట్ 5G ఫోన్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..!
Honor X6d: ప్రస్తుత జనరేషన్ యువత మొబైల్ కొనేటప్పుడు ముందుగా చూసేది దాని లుక్. హానర్ X6d ఈ విషయంలో అస్సలు తగ్గలేదు.
Honor X6d: హానర్ నుంచి అదిరిపోయే బడ్జెట్ 5G ఫోన్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..!
Honor X6d: ప్రస్తుత జనరేషన్ యువత మొబైల్ కొనేటప్పుడు ముందుగా చూసేది దాని లుక్. హానర్ X6d ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. ఈ ఫోన్ వెనుక భాగంలో గ్లోసీ ఫినిషింగ్‌తో పాటు చాలా స్టైలిష్‌గా ఉండే స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. దీనివల్ల ఫోన్ చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఇందులో 6.75 అంగుళాల భారీ HD+ LCD స్క్రీన్ ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌తో వచ్చే ఈ స్క్రీన్ మీద సినిమాలు చూడాలన్నా లేదా యూట్యూబ్ వీడియోలు స్ట్రీమ్ చేయాలన్నా విజువల్స్ చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల గేమింగ్ లవర్స్‌కి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ రోజుల్లో 5G స్పీడ్ అనేది చాలా ముఖ్యం, కాబట్టి ఈ బడ్జెట్ ధరలో కూడా మెరుగైన 5G కనెక్టివిటీని హానర్ ఆఫర్ చేస్తోంది. మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో 4GB RAM ఉంది. అయితే అన్నిటికంటే హైలైట్ విషయం ఏమిటంటే, ఇందులో ఏకంగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం. సాధారణంగా ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత ఎక్కువ స్టోరేజ్ రావడం చాలా అరుదు. దీనివల్ల వేల కొద్దీ ఫోటోలు, వీడియోలు హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9పై రన్ అవుతుంది.
సోషల్ మీడియా యుగంలో కెమెరా లేనిదే ముద్ద దిగదు. అందుకే హానర్ X6d వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను జత చేసింది. దీని ద్వారా పగటి పూట, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా డీటెయిల్డ్ ఫోటోలను క్లిక్ చేయవచ్చు. వీడియోలు తీయడానికి ఇష్టపడే వారి కోసం ఇది 1080p క్వాలిటీ రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరాను అందించారు. ఇది వీడియో కాల్స్, బేసిక్ సెల్ఫీల కోసం సరిపోతుంది. కంటెంట్ క్రియేటర్లకు, రీల్స్ చేసేవారికి ఈ కెమెరా సెటప్ ఆకర్షణీయంగా ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ ఎంత బాగున్నా బ్యాటరీ త్వరగా అయిపోతే చిరాకు వస్తుంది. కానీ ఈ ఫోన్‌లో 5,260mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా హెవీగా వాడినా బ్యాటరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గేమ్స్ ఆడినా, గంటల తరబడి సోషల్ మీడియా వాడినా బ్యాకప్ అదిరిపోతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి, ఆఫీస్ పనుల మీద బిజీగా ఉండేవారికి ఈ బ్యాటరీ సామర్థ్యం చాలా ప్లస్ అవుతుంది. మిడ్-రేంజ్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ దొరకడం ఒక రకమైన అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
ప్రస్తుతానికి హానర్ X6d స్మార్ట్‌ఫోన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. అక్కడ దీని ధర సుమారు రూ.12,600 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ సైన్ వంటి ట్రెండీ రంగుల్లో లభిస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, 5G సపోర్ట్, భారీ స్టోరేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్. ఇండియాలో దీని విడుదల గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లోకి వస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ కోసం చూస్తున్న వారికి ఇది కచ్చితంగా మంచి ఛాయిస్ అవుతుంది.