Google: ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి లేదంటే భారీ మూల్యం తప్పదు..!

Google: ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి లేదంటే భారీ మూల్యం తప్పదు..!

Update: 2023-05-09 14:30 GMT

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి లేదంటే భారీ మూల్యం తప్పదు..!

Android Apps: గత కొంత కాలంగా ప్రమాదకర యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలిగిస్తూ వస్తున్న గూగుల్ తాజాగా మరో 11 యాప్స్ పై బ్యాన్ విధించింది. ఈ యాప్స్ లో సబ్ స్క్రిప్షన్ ట్రోజన్ అనే మాల్వేర్ ఉందని సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కనుగొన్నారు. దీంతో 11 యాప్స్ పై బ్యాన్ విధించి ప్లే స్టోర్ నుంచి తొలిగించడమే కాకుండా వినియోగదారులను సైతం తమ ఫోన్ నుంచి తొలిగించాలని గూగుల్ సంస్థ హెచ్చరించింది.

బ్యాన్ చేసిన యాప్స్..

1) బ్యూటీ కెమెరా ప్లస్ , 2) బ్యూటీ ఫోటో కెమెరా, 3)బ్యూటీ స్లిమ్మింగ్ ఫోటో ఎడిటర్, 4) ఫింగర్ టిప్ గ్రాఫిటి, 5)జిఫ్ కెమెరా ఎడిటర్, 6)హెచ్ డి 4K వాల్ పేపర్, 7)ఇంప్రెషనిజమ్ ప్రో కెమెరా, 8) మైక్రో క్లిప్ వీడియో ఎడిటర్, 9)నైట్ మోడ్ కెమెరా ప్రో, 10)ఫోటో కెమెరా ఎడిటర్, 11)ఫోటో ఎఫెక్ట్ ఎడిటర్

ఈ 11 యాప్స్ పై నిషేధం విధిస్తూ గూగుల్ అండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ను అప్రమత్తం చేసింది. ఈ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే వెంటనే ఒక బగ్ మన ఫోన్ లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మనకు తెలియకుండానే నెలవారీ సబ్ స్క్రిప్షన్ కోసం ఆటోమేటిక్ గా సైన్ అప్ చేస్తుంది. ఈ విషయాన్ని వినియోగదారులు పసిగట్టలేరని..దీంతో జేబులకు చిల్లులు పడడం ఖాయమని గూగుల్ టీమ్ తెలిపింది.

Tags:    

Similar News