Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు..! మిస్ చేయకండి..!

Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది.

Update: 2026-01-17 13:36 GMT

Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, నిత్యావసరాలపై చాలా పెద్ద డిస్కౌంట్స్ ఉన్నాయి. డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే 10 శాతం అదనపు తక్షణ తగ్గింపు వస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ ఉపయోగిస్తే రూ.400 అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అర్హత ఉన్న కొనుగోళ్లపై సూపర్‌కాయిన్స్ కూడా వస్తాయి.

ఐఫోన్ లవర్లకు ఇది గొప్ప అవకాశం

ఐఫోన్ ఇష్టపడేవారికి ఈ సేల్ చాలా మంచి సమయం. ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ ఎయిర్ వంటి లేటెస్ట్ మోడల్స్‌పై బాగా తగ్గింపులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, EMI సౌలభ్యం, క్యాష్‌బ్యాక్‌లతో ఫ్లాగ్‌షిప్ ఫోన్లు చౌకగా దొరుకుతున్నాయి.

ఐఫోన్ 17పై అద్భుత ఆఫర్

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 సేల్ ధర సుమారు రూ.74,900 నుంచి మొదలవుతోంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 4,000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ వస్తుంది. EMI ఆప్షన్‌లో నెలకు సుమారు రూ.6,909 నుంచి ప్రారంభం. ఈ ఫోన్‌లో 6.3 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. A19 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో స్మూత్ పనితీరు ఉంటుంది. 48MP డ్యూయల్ రియర్ కెమెరా, 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ఐఫోన్ 16 రిపబ్లిక్ డే సేల్ ధర సుమారు రూ.56,999 నుంచి మొదలవుతోంది. ప్రీమియం ఫోన్ కావాలనుకునేవారికి ఇది బాగా సరిపోతుంది. ఆక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. నెలవారీ EMI రూ.2,458 నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్‌లో 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. A18 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పనితీరు ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు, వీడియో కాల్స్‌కు బాగుంటుంది.

ఐఫోన్ ఎయిర్ సేల్ ధర రూ. 99,900గా ఉంది. దాదాపు రూ.17,000 డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ దొరుకుతుంది. నెలవారీ EMI రూ. 3,513 నుంచి ప్రారంభం. ఈ ఫోన్‌లో 6.5 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. A19 అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్‌తో వస్తుంది. 48MP ప్రైమరీ రియర్ కెమెరా, 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి చాలా విలువైన అవకాశం. ఐఫోన్ లవర్స్ తమ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ సమయం. బ్యాంక్ ఆఫర్లు, EMI ఆప్షన్లతో ఫ్లాగ్‌షిప్ ఐఫోన్లు సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఐఫోన్ కొనడానికి ఇది బెస్ట్ సేల్‌లలో ఒకటి.

Tags:    

Similar News