Fastrack Smartwatch: ఫాస్ట్‌రాక్ సరసమైన స్మార్ట్‌వాచ్.. ధర రూ.2000 కంటే తక్కువే..!

Fastrack Smartwatch: సాధారణంగా ఫాస్ట్రాక్‌ కంపెనీ స్మార్ట్‌వాచ్‌లు చాలా ఖరీదని అందరు అనుకుంటారు.

Update: 2023-02-07 11:30 GMT

Fastrack Smartwatch: ఫాస్ట్‌రాక్ సరసమైన స్మార్ట్‌వాచ్.. ధర రూ.2000 కంటే తక్కువే..!

Fastrack Smartwatch: సాధారణంగా ఫాస్ట్రాక్‌ కంపెనీ స్మార్ట్‌వాచ్‌లు చాలా ఖరీదని అందరు అనుకుంటారు. ఇలా అనుకుంటే మీరు పొరపాటు చేసినట్లే. ఎందుకంటే కంపెనీ మార్కెట్‌లోకి తన సరసమైన స్మార్ట్‌వాచ్‌ని విడుదల చేసింది. దీనిపేరు రిఫ్లెక్స్ బీట్ ప్లస్. ఇది ఖరీదైన స్మార్ట్ వాచ్‌లో ఉండే అన్ని శక్తివంతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ లక్షణాల కారణంగా దీనికి చాలా డిమాండ్‌ ఏర్పడింది. దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

రిఫ్లెక్స్ బీట్ ప్లస్ 1.69" UltraVu డిస్‌ప్లే, 60 మల్టీ-స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. యుటిలిటీ ఫీచర్‌ల లైనప్‌తో కూడిన ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్ ఫ్యాషన్‌లో అందుబాటులో ఉంది. సరసమైన ధర రూ.1495కి తీసుకువచ్చింది. హార్ట్ రేట్ మానిటర్, ఉమెన్స్ హెల్త్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి. రిఫ్లెక్స్ బీట్ ప్లస్ టచ్‌స్క్రీన్, డిస్‌ప్లే వినియోగదారులకు చక్కటి అనుభూతిని అందిస్తుంది.

రిఫ్లెక్స్ బీట్+ సిలికాన్ స్ట్రాప్ మణికట్టుపై స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది 60 మల్టీ-స్పోర్ట్స్ మోడ్‌లు, IP68 రేటింగ్‌తో వస్తుంది. స్మార్ట్‌వాచ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది అన్ని రకాల క్రీడలు, సాహసాలకు సరైనది. 100కి పైగా క్లౌడ్ వాచ్‌ఫేస్‌లతో వస్తుంది. ఇది వినియోగదారులకు చక్కగా సరిపోలుతుంది.

Tags:    

Similar News