Budget Kitchen Gadgets: బ్యాచిలర్లకు ఇది వరం.. ఈ ఎగ్ బాయిలర్ ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
వంటగదిలో పనిని సులభతరం చేసే స్మార్ట్ గ్యాడ్జెట్ల గురించి నిజానికి చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.
Budget Kitchen Gadgets: బ్యాచిలర్లకు ఇది వరం.. ఈ ఎగ్ బాయిలర్ ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
వంటగదిలో పనిని సులభతరం చేసే స్మార్ట్ గ్యాడ్జెట్ల గురించి నిజానికి చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారికి సమయం ఆదా చేసే అద్భుతమైన గ్యాడ్జెట్ 'ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్'. కేవలం 5 నిమిషాల్లో గుడ్లు, కూరగాయలను ఉడికించే ఈ పరికరం ధర కూడా చాలా తక్కువ. ఈ స్టోరీలో ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ ధర, వాటి ఉపయోగాలను పరిశీలిద్దాం.
సాధారణంగా మనం గుడ్లు లేదా కూరగాయలు ఉడకబెట్టడానికి గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తాం. నిజానికి దీనివల్ల ఎక్కువ సమయం పట్టడమే కాకుండా, గ్యాస్ కూడా ఎక్కువగానే ఖర్చవుతుంది. కానీ నేడు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్లతో మన పని తెలివిగా, చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు.
అమెజాన్‌లో రూ.299 కే 'ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్'..
ప్రస్తుతం అమెజాన్ ఇండియా వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎగ్ బాయిలర్ల ధరలు కేవలం రూ.299 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ ఎగ్ బాయిలర్ కేవలం 350 వాట్ల శక్తితో పనిచేస్తుంది. అంటే ఇది మీ విద్యుత్ బిల్లుపై కూడా పెద్దగా ప్రభావం చూపదని అర్థం. దీని ద్వారా ఒకేసారి 7 గుడ్ల వరకు ఉడకబెట్టవచ్చు. అలాగే దీంతో కేవలం గుడ్లు మాత్రమే కాకుండా, బంగాళదుంపలు, క్యారెట్ వంటి కూరగాయలు లేదా మొక్కజొన్న పొత్తులను (Corn) కూడా ఆవిరిపై సులభంగా ఉడికించుకోవచ్చు.
టాప్ బ్రాండ్ల ధరలు, ఫీచర్లు ఇవే..
అమెజాన్ బేసిక్స్ (Amazon Basics): అమెజాన్ స్వంత బ్రాండ్ అయిన అమెజాన్ బేసిక్స్ ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ ధర సుమారు రూ.389 గా ఉంది. ఇది కూడా ఒకేసారి 7 గుడ్లను ఉడికిస్తుంది. ఇందులో 75ml నీటిని కొలవడానికి ప్రత్యేకమైన 'మెజరింగ్ కప్' కూడా లభిస్తుంది.
లైఫ్‌లాంగ్ (Lifelong): బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో లైఫ్‌లాంగ్ బ్రాండ్ ఎగ్ బాయిలర్ రూ.399 కు అందుబాటులో ఉంది. దీనిలో సింపుల్ ఆన్/ఆఫ్ బటన్ ఫీచర్ అందుబాటులో ఉంది.
పోచ్డ్ ఎగ్స్ (Poached Eggs): మీకు షెల్ లేకుండా నేరుగా ఉడికించే 'పోచ్డ్ ఎగ్స్' అంటే ఇష్టమైతే, లైఫ్‌లాంగ్ 2-ఇన్-1 ఎగ్ బాయిలర్ & పోచర్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. దీని ధర బ్లింక్‌ఇట్‌లో రూ.765 గా ఉంది. ఇది ఒకేసారి 8 గుడ్ల వరకు ఉడికించగలదు.
నోట్: పోచ్డ్ ఎగ్స్ అంటే గుడ్డు పెంకు లేకుండా నేరుగా నీటి ఆవిరిపై ఉడికించినవి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివిగా చెబుతుంటారు.
ఎగ్ బాయిలర్ ఎందుకు కొనాలంటే..
సమయం ఆదా: గ్యాస్ మీద 15 నిమిషాలు పట్టే పని ఎగ్ బాయిలర్ 5-7 నిమిషాల్లో పూర్తవుతుంది.
ఆటోమేటిక్ ఆఫ్: గుడ్లు ఉడకగానే మెషిన్ దానంతట అదే ఆగిపోతుంది, కాబట్టి గుడ్లు పగిలిపోతాయన్న భయం ఉండదు.
బహుళ ప్రయోజనాలు: కూరగాయలు, స్వీట్ కార్న్ ఆవిరి పట్టుకోవడానికి (Steaming) ఇది ఎంతో ఉత్తమంగా పని చేస్తుంది.
బడ్జెట్ ధరలో లభించే ఈ చిన్న గ్యాడ్జెట్ బ్యాచిలర్లకు, ఉద్యోగస్తులకు, గృహిణులకు వంటగదిలో చాలా హెల్ప్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.