iPhone 16 Price Cut: అయ్య బాబోయ్ ఇదేం రచ్చ.. ఐఫోన్ 16పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా తక్కువ ధరకే ఇంటికి..!
iPhone 16 Price Cut: మీరు కొత్త ఐఫోన్ కొనాలనుకుంటే ఇదే సరైన అవకాశం. ఐఫోన్ 16 ఇప్పుడు మునుపటి కంటే తక్కువ ధరకు లభిస్తుంది.
iPhone 16 Price Cut: అయ్య బాబోయ్ ఇదేం రచ్చ.. ఐఫోన్ 16పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా తక్కువ ధరకే ఇంటికి..!
iPhone 16 Price Cut: మీరు కొత్త ఐఫోన్ కొనాలనుకుంటే ఇదే సరైన అవకాశం. ఐఫోన్ 16 ఇప్పుడు మునుపటి కంటే తక్కువ ధరకు లభిస్తుంది. గతంలో దీని ధర రూ.79,900 ఉండగా, ఇప్పుడు ఈ ఫోన్ దాదాపు రూ.69,500కే అందుబాటులో ఉంది. దీనితో పాటు, బ్యాంక్ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది, ఇది మరింత తగ్గింపును అందిస్తుంది. ఐఫోన్ 16 డిజైన్ చాలా బాగుంది. ఇందులో చాలా మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. మీరు తక్కువ ధరకు మంచి ఫోన్ కొనాలనుకుంటే ఈ డీల్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iPhone 16 Discount Offer
ఐఫోన్ 16 సెప్టెంబర్ 2024లో భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ ప్లస్, ప్రో, ప్రో మాక్స్ అనే మూడు వేరియంట్లలో వస్తుంది. ప్రారంభంలో, ఐఫోన్ 16 ధర రూ.79,900 నుండి ప్రారంభమైంది. ఇప్పుడు 128GB మోడల్ ధర దాదాపు రూ.69,500కి తగ్గింది. అలాగే, కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా ధరపై అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ల కారణంగా, ఐఫోన్ 16 ఇప్పుడు గతంలో కంటే తక్కువ ధరలకు అందుబాటులో ఉంది. ఈ డీల్స్ అన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి పొందచ్చు.
iPhone 16 Specifications
ఐఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేకి సిరామిక్ షీల్డ్ ప్రొటక్షన్ అందించారు. మొబైల్ A18 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 128జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
మంచి ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది, అల్ట్రా-వైడ్ కెమెరాతో మీరు క్లోజప్, మాక్రో ఫోటోలను కూడా తీయవచ్చు. కనెక్టివిటీ కోసం, దీనిలో 5జీ, 4జీ, వైఫై 6E, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బి టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉండటం వలన వాటర్, డస్ట్ నుంచి కూడా ప్రొటక్ట్‌గా ఉంటుంది.