John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా రెజ్లింగ్‌కు రిటైర్మెంట్
John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులను షాక్‌కు గురిచేస్తూ జాన్ సీనా రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులను షాక్‌కు గురిచేస్తూ జాన్ సీనా రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2002లో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీనా, కేవలం ఒక దశాబ్దంలోనే గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. 17 సార్లు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. లెజెండరీ రిక్ ఫ్లెయిర్‌తో కలిసి అత్యధిక వరల్డ్ టైటిల్స్ గెలిచి రికార్డును నెలకొల్పారు. రెజ్లింగ్‌లో సూపర్ స్టార్‌గా అభిమానులను అలరించిన సీనా సినీ రంగంలోను రాణించారు. 30 పైగా సినిమాల్లో నటించారు. నెవర్ గివ్ ఆఫ్ అనే స్ఫూర్తిని నింపిన జాన్ సీనా క్రీడా ప్రస్థానం ముగియనుందని తెలిసి అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.
జాన్ ఫెలిక్స్ ఆంథోనీ సీనా అమెరికా దేశంలో 1977లో జన్మించాడు. మొదట బాడీబిల్డర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, 2002లో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టాడు. రెండు దశాబ్దాలలో ఎనో విజయాలు సాధించి ప్రచంచ వ్యాప్తంగా అభిమానులను సంపాందించాడు. అతను ఏకంగా 17 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని, దిగ్గజం ఫ్లెయిర్ రికార్డులను సమం చేశాడు. దీనితో పాటు, అతను 5 సార్లు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, 4 సార్లు టాగ్ టీమ్ ఛాంపియన్, 2008, 2013లో రెండు సార్లు రాయల్ రంబుల్ విజేత, మనీ ఇన్ ది బ్యాంక్ విజేతగా నిలిచాడు. రింగ్‌లో అతని ట్రేడ్‌మార్క్ కదలికలు, అటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్ ప్రత్యర్థులకు గట్టి సవాలు విసిరేవి అనడంలో అతియో శక్తి కాదు.
మేక్ ఏ వీస్ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పిల్లల కలలను నెరవేర్చడంలో అతని పాత్ర అభినందనీయం. రెజ్లింగ్‌తో పాటు, జాన్ సీనా హాలీవుడ్‌లో కూడా తన ముద్ర వేశాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ది సూసైడ్ స్క్వాడ్, పీస్‌మేకర్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు, టీవీ షోలలో నటించి, తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతను పార్ట్-టైమ్ రెజ్లర్‌గా ఉన్నప్పటికీ, రింగ్‌లోకి వచ్చిన ప్రతిసారీ అభిమానుల నుంచి లభించే అపారమైన మద్దతు, అతనికి ఉన్న శాశ్వతమైన స్టార్‌డమ్‌ను తెలియజేస్తుంది.జాన్ సీనా రిటైర్మెంట్ ఈ నెల 13న ముగియనుంది. లాస్ట్ ట్యామ్ ఈజ్ నవ్ అనే ఫేర్‌వెల్ టూర్‌లో సీనా చివరి మ్యాచ్ అడనున్నారు.