Greatest Wicket Keeper: చేతుల్తోనే కాదు... నడుముతోనూ క్యాచ్ పట్టొచ్చు
Greatest Wicket Keeper: కేరళ ప్రీమియర్ లీగ్‌లో నడుముతో క్యాచ్ పట్టిన వికెట్ కీపర్
Greatest Wicket Keeper: చేతుల్తోనే కాదు... నడుముతోనూ క్యాచ్ పట్టొచ్చు
Greatest Wicket Keeper: క్రికెట్‌లో వికెట్ కీపర్లే కీలకం. బ్యాటర్లను పెలివియన్ పట్టించడంలో తమవంతు పాత్ర పోషిస్తారు. చురుకుగా కదులుతూ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టిస్తుంటారు. దూరం వెళ్తున్న బంతినైనా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంలో ఆరి తేరి ఉంటారు. ఏ వికెట్ కీపర్ కూడా పట్టని రీతిలో నడుము ద్వారా క్యాచ్ అందుకున్నాడు. కేరళ ప్రీమియం లీగ్‌లో భాగంగా కేపీఏ 123 వర్సెస్ కేసీఎస్‌ఏ కాలికట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే రెండు ఓవర్లలోనే పది పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
ఫిరాజ్ అనే బౌలర్ మూడో ఓవర్ వేయగా.. బంతి కాస్తా బ్యాటర్ ఎడ్జ్‌కు తాకి వికెట్ కీపర్ పక్కదిశగా వెళ్లింది. అదే సమయంలో కీపర్ పక్కకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అతడు కిందపడే క్రమంలో బంతి అతి కుడి చేతికి తాకి పైకి ఎగిరి అతడి నముడు మీద పడింది. అప్పుడు ఆ కీపర్ బంతి కింద పడకుండా నడుముకు రెండు చేతులు అడ్డం పెట్టి చాకచక్యంగా ఆపాడు. పక్కనే ఉన్న ఫీల్డర్ వచ్చి కీపర్ మీద ఉన్న బాల్‌ను తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇది కదా క్యాచ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.