Vijay Hazare Trophy : విరాట్ కోహ్లీ మరో మ్యాచ్ ఆడతాడా? రోహిత్ శర్మపై తాజా అప్‌డేట్ ఇదే!
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడిన రెండు మ్యాచ్‌లలో వారి ప్రదర్శనలను అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు.
Vijay Hazare Trophy : విరాట్ కోహ్లీ మరో మ్యాచ్ ఆడతాడా? రోహిత్ శర్మపై తాజా అప్‌డేట్ ఇదే!
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడిన రెండు మ్యాచ్‌లలో వారి ప్రదర్శనలను అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు. డిసెంబర్ 24 న జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. అయితే, రెండో మ్యాచ్‌లో విరాట్ 77 పరుగులు చేసినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం గోల్డెన్ డక్ గా వెనుదిరిగారు. ఈ టోర్నమెంట్ జనవరి 18 వరకు కొనసాగనుండగా, ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ ఆడతారా లేదా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
విరాట్ కోహ్లీ మరో మ్యాచ్ ఆడటం ఖాయమా?
విరాట్ కోహ్లీ మొదట రోహిత్ శర్మ మాదిరిగానే కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విరాట్ జనవరి 6 న రైల్వేస్ జట్టుపై జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరఫున ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విరాట్ బెంగళూరుకు వెళ్లిపోయినప్పటికీ, తిరిగి వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. విరాట్ కోహ్లీ కిట్లు, సామాగ్రి ఇంకా ఢిల్లీ జట్టుతోనే ఉన్నట్లు సమాచారం. అయితే, విరాట్ ఆ రోజు ఆడతాడా లేదా అనేది భారత జాతీయ జట్టు ట్రైనింగ్ క్యాంప్‌పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జనవరి 11 నుంచి భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రెండు మ్యాచ్‌లలో 208 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మపై తాజా అప్‌డేట్ ఇదే
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ మాత్రం విజయ్ హజారే ట్రోఫీ 2025-26 లో మళ్లీ కనిపించే అవకాశం లేదు. ఆయన ఉత్తరాఖండ్‌పై మ్యాచ్ ఆడిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లారు. రోహిత్ శర్మ అస్సాంపై 155 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, ఉత్తరాఖండ్‌పై మాత్రం ఖాతా తెరవలేకపోయారు. రోహిత్ తిరిగి వెళ్లడంతో, ముంబై క్రికెట్ అసోసియేషన్ త్వరలోనే ఆయన స్థానంలో మరొక ఆటగాడిని ప్రకటించనుంది. ముంబై జట్టు తదుపరి మ్యాచ్ డిసెంబర్ 29 న ఛత్తీస్‌గఢ్‌తో జరగనుంది.
భారత జట్టు శిక్షణ కీలకం
ఈ టోర్నమెంట్ పూర్తి కాకముందే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌ను వీడటానికి ప్రధాన కారణం, రాబోయే భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జాతీయ జట్టు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడమే. ఈ క్యాంపులో పాల్గొనడం వీరి అంతర్జాతీయ కెరీర్‌కు ముఖ్యం కాబట్టి, విరాట్ ఆడే జనవరి 6 మ్యాచ్ డెసిషన్ కూడా బీసీసీఐ, టీమ్ ఇండియా కోచ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.