Kohli-Anushka: బృందావ‌నంలో విరాట్ కోహ్లీ దంప‌తులు.. వైరల్‌ అవుతున్న ఫోటోలు!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు సోమవారం అధికారికంగా గుడ్‌బై చెప్పారు.

Update: 2025-05-13 11:15 GMT

Kohli-Anushka: బృందావ‌నంలో విరాట్ కోహ్లీ దంప‌తులు.. వైరల్‌ అవుతున్న ఫోటోలు!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు సోమవారం అధికారికంగా గుడ్‌బై చెప్పారు. 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికిన తర్వాత, కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి యూపీలోని బృందావన్ దామ్ (Vrindavan Dham)ను సందర్శించారు.

వీరిద్దరూ అక్కడ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj)ను కలుసుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ వీరికి ప్రత్యేక ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఈ సెలబ్రిటీ దంపతులు గతంలో కూడా అనేకసార్లు ఈ ఆశ్రమాన్ని సందర్శించగా, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వ్యక్తిగతంగా పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదే కావడం విశేషం.

విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ (Virat Kohli Test Career) 2011లో వెస్టిండీస్‌తో మొదలై, 2024 వరకు మొత్తం 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు (Centuries), 31 అర్ధశతకాలు (Half-centuries) ఉన్నాయి. ఇంతకు ముందు కోహ్లీ టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022) అనంతరం టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో (ODI Cricket) మాత్రమే కొనసాగనున్నాడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల బృందావన్ దాములో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ దంపతుల ఆధ్యాత్మిక యాత్రను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.


Tags:    

Similar News