ఐసీసీ ఆలోచన మంచిదికాదు
సంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లో నూతన నిబంధనలు తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) భావించింది.
సంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లో నూతన నిబంధనలు తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) భావించింది. అందులో భాగంగా ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023లో తీసుకురావాలనే నిచ్చయంతో ఉంది. దీనిపై పలువురు కీలక ఆటగాళ్లు స్పందిస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్లేయర్ పీటర్ సిడిల్ మొదటి నాలుగు రోజుల ఫార్మాట్‌ను వ్యతిరేకించాడు. నాలుగు రోజుల్లో టెస్టు్ల్లో విజయాల కంటే డ్రాలు ఎక్కవగా ఉంటాయని సిడిల్ పేర్కొన్నాడు.
ఇక తాజాగా దీనిపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఐదు రోజుల టెస్టులను నాలుగు రోజులకు కుదించడం కోహ్లీ విముఖత వ్యక్తం చేశాడు. ఈ ఆలోచన సరైయింది కాదని అన్నాడు. మార్పుల పేరుతో టెస్టు క్రికెట్‌ను నాలుగు రోజులకు తగ్గించడం మంచి పరిణామం కాదని తెలిపాడు. ఆదివారం నుంచి భారత శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గువహటి వేదికగా తొలి టీ20 ఆదివారం ఆరంభం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. డే/నైట్ టెస్టులు విజయవంతమైయ్యాయి. డే/నైట్ టెస్టులో మార్పు తీసుకొచ్చి ఆశస్తికరంగా మరిస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టులను 4రోజులు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండబోదని కోహ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ సైతం వ్యతిరేకించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐసీసీ ప్రతిపాదన తమ దృష్టికి రాలేదని అది వచ్చాక చూద్దామని తేల్చి చేప్పారు.
2017లోనూ సౌతాణాఫ్రికా, జింబాబ్వేలు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లు సక్సెస్ కావడంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. క్రికెట్ ఆడే పలు దేశాల్లో టీ20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని టెస్టు మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అయితే పలువురు ఆటగాళ్లు ఇప్పటికే దీనిపై పెదవి విరుస్తున్నారు.