Vaibhav Suryavanshi: క్రికెట్‌లో హీరో.. చదువులో జీరోనా? వైభవ్ సూర్యవంశీ రిజల్ట్ కథేంటి?

Vaibhav Suryavanshi : దేశవ్యాప్తంగా ఇప్పుడు 10వ తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడుతున్నాయి.

Update: 2025-05-15 05:24 GMT

Vaibhav Suryavanshi : క్రికెట్‌లో హీరో.. చదువులో జీరోనా? వైభవ్ సూర్యవంశీ రిజల్ట్ కథేంటి?

Vaibhav Suryavanshi : దేశవ్యాప్తంగా ఇప్పుడు 10వ తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడుతున్నాయి. సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డుల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వచ్చిన వార్తల ప్రకారం, వైభవ్ సూర్యవంశీ సీబీఎస్ఈ బోర్డు నుండి 10వ తరగతి పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడట. అంటే ఆటల్లో హీరో, చదువులో జీరో అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కానీ ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకుందాం.

సోషల్ మీడియా ద్వారా వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ అయ్యాడనే వార్తను పరిశీలిస్తే.. అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. అంటే, వైభవ్ సూర్యవంశీ బోర్డు పరీక్షలో ఫెయిల్ కాలేదు. మరి అతను పరీక్ష పాస్ అయ్యాడా? లేదు, అదీ నిజం కాదు. ఎందుకంటే, అతను పరీక్ష రాస్తేనే కదా పాస్ లేదా ఫెయిల్ అనే ప్రశ్న వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ వార్త ఒక వ్యంగ్యం అని అర్థం అవుతుంది.

ఇది వార్త కాదు.. ఒక సెటైర్!

వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజానికి ఒక సెటైర్. అందులో నిజం అనేదే లేదు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత, అతని ఆన్సర్ షీట్‌ను డీఆర్‌ఎస్ తరహాలో సమీక్షించాలని బీసీసీఐ అభ్యర్థించిందని అందులో రాశారు.

ఇక అసలు నిజం ఏమిటంటే, వైభవ్ సూర్యవంశీ ఇంకా 10వ తరగతి విద్యార్థి కూడా కాదు. అతను 9వ తరగతి చదువుతున్నాడు. అంటే అతని బోర్డు పరీక్షలకు ఇంకా సమయం ఉంది. 14 ఏళ్ల సూర్యవంశీ ఐపీఎల్ 2025లో కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 11 సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్ ప్రపంచంలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్ పేరు అది! 

Tags:    

Similar News