Under-19 ‌: ఫైనల్లో వెలుగులోకి మరో ఘటన.. ట్రోఫీని విరగొట్టిన జైశ్వాల్

దక్షిణాఫ‌్రికా వేదికగా జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ పైనల్లో మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2020-02-14 05:12 GMT
యశస్వి జైశ్వాల్ ఫైల్ ఫోటో

దక్షిణాఫ‌్రికా వేదికగా జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ పైనల్లో మరో సంఘటన సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బంగ్లాదేశ్ టీమిండియా మధ్య జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లా జట్టు భారత్ పై మూడు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, విజయం అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు సహనాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లు, ఒక్కసారిగా మైదానంలోకి దూసురావడంతోపాటు భారత్ క్రికెటర్లపై వేకిలి చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఫీల్డ్‌ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం సర్థుమనిగింది.

అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం భారత అండర్ -19 ఆటగాడు ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా సహనం కోల్పోయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నిమెంట్ అవార్డు రెండుగా విరగొట్టిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. టోర్నీలో జైశ్వాల్ నిలవగా 400 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో జైశ్వాల్ 'మ్యాన్ ఆఫ్ ద టోర్నీమెంట్' అవార్డు లభించింది. ఫైనల్లో ఓటమితో బాధలో ఉన్న జైశ్వాల్ ఆ కప్ ను పగలకొట్టినట్లు తెలుస్తోంది.

ట్రోఫీని విరగొట్టడంపై యశస్వి జైశ్వాల్ కోచ్ జ్వాలా సింగ్ స్పందించారు. జైశ్వాల్ ' పరుగులపై శ్రద్ధ పెడతాడు తప్ప.. ఇలాంటి ట్రోఫీలపై కాదు.. అతను ఇలా చేయడం ఇదేం కొత్త కాదు అటూ కోచ్ జ్వాలా సింగ్ అని వెనకేసుకొచ్చాడు. జైశ్వాల్ ఇలా చేయడంపై కొందరు సినీయర్ ఆటగాళ్లు పెదవి విరిస్తున్నారు. జైశ్వాల్ మంచి భవిష్యత్తు ఉందని అతను అసహనం కోల్పోయి ఇలా ప్రవర్తించడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తం మీద ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, 4 అర్థశతకాలతో 400 పరుగులు సాధించాడు. లీగ్ దశలోనూ.. 88, 105 నాటౌట్, 62, 57 నాటౌట్, 29 నాటౌట్, 59‌ పరుగులు చేశాడు. కానీ.. వరుస విజయాలతో దూసుకెళ్లిన జట్టు పైనల్లో మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్, బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో జైశ్వాల్ చాలా నిరాశకి గురయ్యాడు.

 

Tags:    

Similar News