టోక్యో ఒలింపిక్స్ కొత్త తేదీలు ఖరారు

కరోనా మహమ్మారి దెబ్బకు క్రీడా రంగం అతలాకుతలమైంది.

Update: 2020-03-30 13:05 GMT

కరోనా మహమ్మారి దెబ్బకు క్రీడా రంగం అతలాకుతలమైంది.ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కాస్త వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్‌ కొత్త తేదీలు ఖరారయ్యాయి. 2021 జులై నెలలో ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ప్రకటించారు. 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ జరుగనున్నాయి.

ప్రాణాంతక వైరస్‌ సృష్టిస్తోన్న విపత్కర పరిస్థితులను దాటి ఒలింపిక్స్‌ కోసం సిద్ధం కావాలంటే సమయం పడుతుందని, కాబట్టి వచ్చే ఏడాది జులై 23న ఈ మెగా క్రీడలను ఆరంభించే వీలుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మారథాన్‌ లాంటి రేసుల్లో పాల్గొనే అథ్లెట్లకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో క్రీడలను నిర్వహిస్తే ప్రయోజనం చేకూరుతుందని ఇటీవల టోక్యో గవర్నర్‌ యురికో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News