పది నెలల హైదరాబాదీ బుడ్డోడికి సచిన్ ఫిదా
ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్రౌండ్ నుంచి రిటైర్ అయ్యారే కానీ.. ఫ్యాన్స్ గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలం.
ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్రౌండ్ నుంచి రిటైర్ అయ్యారే కానీ.. ఫ్యాన్స్ గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలం. ఎందరు కొత్త ఆటగాళ్లు వచ్చినా.. ఎంతగా మెరిసినా.. సచిన్ ప్లేస్ ఎప్పటికీ క్రికెట్ రారాజుగా అలానే ఉంటుంది. దీనిని నిరూపించే ప్రత్యక్ష సాక్ష్యమే ఈ ఫొటో. సచిన్ జెర్సీతో ఉన్న ఈ బుడ్డోడి పేరు శ్రేష్ఠ్ మెహతా. 10 నెలల వయసున్న ఈ బుడతడి ఫొటోను తన మేనమామ ఆనంద్ మెహతా సచిన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన అతడు ఎల్బీ స్టేడియానికి మేనల్లుడిని తీసుకెళ్లినప్పుడు తీసిన ఫొటోలివి. ఫిబ్రవరి 16న అతడు ఈ ఫొటోలను ట్వీట్ చేశాడు. 'సచిన్ సార్.. మీరు క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. మా గుండెల్లో నుంచి ఎప్పటికీ రిటైర్ అవ్వరు. మా లిటిల్ మాస్టర్ (శ్రేష్ఠ్ మెహతా) తరఫు నుంచి లిటిల్ మాస్టర్ బ్లాస్టర్‌కు చిరు సత్కారం' అని క్యాప్షన్ పెట్టారు ఆనంద్ మెహతా. 'మీరు 186 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఎల్బీ స్టేడియం నుంచి 10 నెలల నా మేనల్లుడు' అంటూ హ్యాష్ ట్యాగ్స్ రూపంలో చెప్పాడు.
Never too young for 🏏😀!!
— Sachin Tendulkar (@sachin_rt) February 28, 2020
Thank you for sharing such beautiful pictures.
I wish all the very best to 10-month old Shresth and his family. https://t.co/tKWfCw1C95