New Zealand ODI Series:న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియాకు వరుస షాక్‌లు.. గాయంతో వాషింగ్టన్ సుందర్ ఔట్

New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుంచి తప్పుకోగా, అతని స్థానంలో ఆయుష్ బదోనికి అవకాశం కల్పించారు. ఇప్పటికే రిషబ్ పంత్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

Update: 2026-01-12 10:48 GMT

New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితమే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం కల్పించారు.

వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్ ఎడమ పక్కటెముకల కింద నొప్పితో ఇబ్బంది పడ్డాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతనికి మరిన్ని స్కాన్‌లు నిర్వహించి, వైద్య నిపుణుల సలహా తీసుకుంటామని పేర్కొంది.

Tags:    

Similar News