వారితో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం.. బాంద్రా ఘటనపై భజ్జీ సీరియస్

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఈ నెల 3 వరకు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

Update: 2020-04-15 09:16 GMT
Harbajan Singh (File Photo)

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఈ నెల 3 వరకు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నెల 20 నుంచి పలు ప్రాంతాల్లో సడలించే అవకాశాలు ఉన్నాయని మోదీ తెలిపారు. లాక్‌డౌన్‌ను పొడిగించడంపై మహారాష్ట్రలోని బాంద్రా రైల్వేస్టేషన్‌ సమీపంలో వలస కార్మికులు భారీ ఎత్తున అందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వసతి కల్పించి, ఆహారం అందిస్తుందని పోలీసులు హామీ ఇవ్వడంతో వలస కార్మికులు ఆందోళనను విరమించుకున్నారు. లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించడంతో ... దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వలస కార్మికులు అందోళనకు దిగారు.

అయితే ఈ ఘటనపై భారత క్రికెట్ జట్టు సీనియర్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. బంద్రా ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా రోడ్లపైకి రావడాన్ని భజ్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్కరిని ఇళ్లకే పరిమితం చెయ్యడానికి లాక్ డౌన్ మార్గం అన్నాడు. బాంద్రాలో జరిగిన ఘటన అంగీకరించలేనిదని, ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. వారితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు'' అని భజ్జీ ట్వీట్ లో పేర్కొన్నాడు.



Tags:    

Similar News