India World Cup Victory: అపూర్వ ఘట్టానికి 37 ఏళ్లు.. గుర్తుచేసుకుంటున్న క్రికెటర్లు

Team India: భారత్ లో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది ఆ రోజే.

Update: 2020-06-25 12:24 GMT

భారత్ లో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది ఆ రోజే. భారత క్రికెట్‌ చరిత్రలోనే చెరగని ముద్రవేసిన రోజు ఇదే. యావత్ క్రికెట్‌ ప్రపంచాన్ని చాటి చెప్పిన రోజు గురించి ఎవరు మర్చిపోరు. ఇదే రోజు కపిల్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983 వన్డే వరల్డ్‌కప్‌ విజేతగా నిలవడమే. భారత క్రికెట్‌ గతిని మార్చేసి సరిగ్గా నేటితో 37 ఏళ్లు.

ఈ సందర్భంగా పలువురు టీమిండయా క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ఆ అద్భుత క్షణాన్ని నెమరువేసుకుంటున్నారు. అప్పటి టీమిండియా సారథి కపిల్‌దేవ్‌తో పాటు నాటి క్రికెటర్‌, ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి, వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్ సింగ్‌లు ఆ మధుర ఘట్టాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ రోజును స్మరించుకున్నారు. లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ అందుకున్న ఫొటోను షేర్ చేస్తూ 'చారిత్రాత్మక రోజుకు 37 ఏళ్లు. అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇక 1983 వరల్డ్ కప్ విజయంతో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేశారనీ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ ట్వీట్ చేశాడు. 'దేశం గర్వించిన రోజు ఇదే. సరిగ్గా ఇదే రోజు మా సీనియర్లు వరల్డ్ కప్ అందుకున్నారు. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడికి అభినందనలు. ఈ విజయంతో 2011 ప్రపంచకప్‌ను మేం గెలిచేలా బెంచ్ మార్క్ సెట్ చేశారు. అని యూవీ పేర్కొన్నాడు.1983 జూన్‌ 25న ప్రపంచ చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నాం. అలాగే గెలిచాం అని త్రోబ్యాక్ పిక్ జత చేస్తూ రవిశాస్త్రి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 183 పరుగులు చేసి కుప్పకూలింది. అనంతరం 184పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే కుప్పకూలింది. మోహిందర్‌ అమర్‌నాథ్‌ ఆల్‌రౌండ్ షోతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత్ విశ్వవిజేతలుగా నిలిచి క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం లిక్కించింది.







Tags:    

Similar News