IND vs NZ: తొలి టీ20లో టీమిండియా ఓటమి
IND vs NZ: 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం
IND vs NZ: తొలి టీ20లో టీమిండియా ఓటమి
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చివర్లో అర్ధసెంచరీతో పోరాడినప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, శాంటర్న్, ఫెర్గూసన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా ఇష్ సోధి, జాకబ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్ నష్టానికి 176 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు డారిల్ మిచెల్ 30 బంతుల్లో 59 పరుగులు చేశారు. డారిల్ మిచెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.