HCA: అజారుద్దీన్ పై సీబీఐ విచారణ జరపాల్సిందే.. సంచలన ఆరోపణలు చేసిన యెండల..

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై విమర్శలు ఊపందుకున్నాయి.

Update: 2021-03-25 14:23 GMT

HCA: అజారుద్దీన్ పై సీబీఐ విచారణ జరపాల్సిందే.. సంచలన ఆరోపణలు చేసిన యెండల.. 

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై విమర్శలు ఊపందుకున్నాయి. అజారుద్దీన్‌ వచ్చిన తర్వాత హెచ్‌సీఏకు ఒరిగిందేమీ లేదని ప్రత్యర్దులు దాడి చేస్తున్నారు. హెచ్‌సీఏ పరిధిలో జరిగే సెలక్షన్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అజారుద్దీన్‌పై ఉన్న పాత కేసులు తిరగదోడేందుకు సిద్ధమౌతున్నారు. ఢిల్లీలో పెద్దలను కలిసేందుకు సమాయాత్తమౌతున్నారు.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయింది. అవినీతి ఆరోపణలు అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. HCA అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌ నాయకత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ క్రికెట్‌ అసోసి‍యేషన్ ప్రెసిడెంట్‌ యెండల లక్ష్మీనారాయణ అజార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లను అజారుద్దీన్‌ ప్రోత్సహించడం లేదని యెండల ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అనేక అవకతవకలు జరిగాయని యెండల ఆరోపించారు. హైదరాబాద్‌ క్రికెట్‌కు అజారుద్దీన్‌ చేసింది శూన్యమని దుయ్యబట్టారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అభియోగాల నుంచి అజారుద్దీన్‌ తప్పించుకోలేరని యెండల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో అజార్‌కు క్లీన్‌ చిట్ రాలేదని ఎన్నికల్లో పోటీ చేయడానికి కోర్టును తాత్కాలిక అనుమతి మాత్రమే తీసుకున్నాడని యెండల గుర్తుచేశారు. అజార్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసు విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తాను కలుస్తానని యెండల స్పష్టం చేశారు. అజార్ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని అమిత్‌ షా ను కోరతానని యెండల తెలిపారు.

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌‌లోని పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత HCAలో అవకతవకలు జరగకుండా చూసేందుకు సిద్ధమౌతున్నారు. స్కామ్స్‌‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హెచ్‌సీఏలో ప్రక్షాళన చేసేందుకు ఆమె సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్‌ వచ్చిన తర్వాత కూడా హెచ్‌సీఏలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News