Steve Smith: కేవలం ఒకే ఒక్క పరుగుతో హిస్టరీ క్రియేట్ చేసిన స్టీవ్ స్మిత్..!

Steve Smith: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు.

Update: 2025-01-29 12:11 GMT

Steve Smith: కేవలం ఒకే ఒక్క పరుగుతో హిస్టరీ క్రియేట్ చేసిన స్టీవ్ స్మిత్..!  

Steve Smith: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో కేవలం ఒక పరుగు చేయగానే అతను 10,000 టెస్ట్ పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. ఈ ఫీట్‌ను అందుకున్న నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్‌గా, మొత్తం మీద 15వ ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ఇంకా ఈ ఘనతను అందుకోలేకపోవడం విశేషం.

ఒక్క పరుగుతో చరిత్ర

భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసే సమయానికి స్మిత్‌కు 9999 టెస్ట్ పరుగులు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి పరుగు చేసిన వెంటనే, అతను 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇది 115 మ్యాచ్‌లలో 205 ఇన్నింగ్స్‌లలో సాధించిన గొప్ప రికార్డు.

కోహ్లీ, విలియమ్సన్‌ను అధిగమించిన స్మిత్

ప్రస్తుత క్రికెట్‌లో 'ఫ్యాబ్ ఫోర్'గా పేరుగాంచిన స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్‌లలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసినవాడు జో రూట్ (12,972). ఇప్పుడు స్మిత్ కూడా 10 వేల మార్క్‌ను దాటగా, కోహ్లీ (9230), విలియమ్సన్ (9276) ఇంకా ఈ లెక్కకు దూరంగా ఉన్నారు.

టెస్ట్ సెంచరీల్లో స్మిత్ హవా

పరుగులతో పాటు సెంచరీల పరంగా కూడా స్మిత్ తనదైన ముద్రవేశాడు.

* స్టీవ్ స్మిత్ – 115 మ్యాచ్‌లు, 205 ఇన్నింగ్స్‌లు, 10,000+ పరుగులు, 34 సెంచరీలు.

* కేన్ విలియమ్సన్ – 105 మ్యాచ్‌లు, 186 ఇన్నింగ్స్‌లు, 9276 పరుగులు, 33 సెంచరీలు.

* విరాట్ కోహ్లీ – 123 మ్యాచ్‌లు, 210 ఇన్నింగ్స్‌లు, 9230 పరుగులు, 30 సెంచరీలు.

ఈ గణాంకాలతో స్టీవ్ స్మిత్ తన స్థాయిని మరోసారి రుజువు చేసుకున్నాడు. అద్భుతమైన ఫుట్‌వర్క్, నిలకడగా రన్స్ చేయగల సామర్థ్యంతో అతను క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు.

Tags:    

Similar News