Breaking News: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్

Australia Captain Steve Smith Retires From ODIs
x

Steve Smith: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్

Highlights

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా

Steve Smith: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు గుడ్ బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటన చేశాడు. సెమీ ఫైనల్‌లో భారత్ పై ఓటమి తర్వాత స్మిత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఆస్ట్రేలియా తరపున అత్యంత విజయవంతమైన వన్డే ఆటగాళ్లలో ఒకరైన స్మిత్.. 2010లో వెస్టిండీస్‌తో వన్డేలో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 170 వన్డేలు ఆడి 43.28 సగటుతో 5 వేల 800 పరుగులు చేశారు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2015, 2023లలో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన స్మిత్ 2015లో వన్డే కెప్టెన్ అయ్యాడు. పాట్ కమ్మిన్స్ లేనప్పుడు తన చివరి మ్యాచ్‌లో తాత్కాలికంగా కెప్టెన్సీని నిర్వహించాడు. 35 ఏళ్ల స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ టెస్ట్, టీ20 క్రికెట్‌లలో ఆడనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories