Vinesh Phogat: యూటర్న్ తీసుకున్న వినేశ్ ఫొగాట్.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్సే లక్ష్యం!
Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం (నేడు) ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
Vinesh Phogat: యూటర్న్ తీసుకున్న వినేశ్ ఫొగాట్.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్సే లక్ష్యం!
Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం (నేడు) ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తన ఒలింపిక్ కలను నెరవేర్చుకోవడం కోసం మళ్లీ రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఆమె తెలిపారు. వినేశ్ ఫొగాట్ ప్రధానంగా 2028లో జరగబోయే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో పోటీపడేందుకు సిద్ధమవుతున్నట్లు ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి రజతం ఖాయం చేసుకున్న వినేశ్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. రెండో రోజు బరువు చూసే సమయంలో కేవలం 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ బాధతోనే ఆమె రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అంతేకాకుండా, ఈ జులైలో ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు.
రింగ్‌లోకి తిరిగి రావడానికి తన కుమారుడే అసలైన ప్రేరణ అని వినేశ్ పేర్కొన్నారు. "ఈసారి నేను ఒంటరిగా ప్రయాణించడం లేదు. నా టీమ్‌లో ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు. వాడే నాకు అసలైన ప్రేరణ. నా లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్ ప్రయాణంలో వాడు నా చిట్టి చీర్‌లీడర్" అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.
వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యాన్ని సాధించలేకపోయారు. 2016 ఒలింపిక్స్‌లో మోకాలి గాయం కారణంగా క్వార్టర్స్ నుంచే వైదొలిగారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా క్వార్టర్స్‌లోనే ఓటమి చవిచూశారు. 2024లో త్రుటిలో పతకం చేజార్చుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె ఇప్పుడు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ లక్ష్యంగా అడుగులు వేయనున్నారు.