ఆ విషయాన్ని గంగూలీ చూసుకుంటాడు.. అక్తర్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-01-06 13:00 GMT
Shoaib Akhtar

సంప్రదాయ క్రికెట్ టెస్టులు ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించే విధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐసీసీ నిర్ణయంపై పలువురు క్రికెట్లర్లు పెదవి విరుస్తున్నారు. ఐసీసీ నిర్ణయం సరైంది కాదని ఆవిధంగా నిర్ణయం తీసుకుంటే టెస్టు క్రికెట్ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని కొందరు క్రికెటర్ల విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బౌలర్ రవల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా చేరారు. ఐసీసీ ప్రతిపాదనను తప్పుబట్టారు. 2023-2031 షెడ్యూల్‌ నుంచి ఈ మార్పులు చేయనుంది.

సోషబ్ అక్తర్ బహిరంగంగానే తన యూట్యూబ్ చానల్లో ఐసీసీ ప్రతిపాదనను తిరస్కరించారు. ఐసీసీ ఆసియా క్రికెట్ జట్లపై వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఐదు రోజుల టెస్టు ఫార్మాట్ కాస్త నాలుగు రోజులకు మార్పుకు నిర్ణయం తీసుకుందన్నారు. అక్తర్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.."ఆసియా జట్లకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుంది. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ పూర్తిగా ఆసియా జట్లకు వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. అయితే ఇది చెత్త ఆలోచనని విమర్శించారు.

అయితే ఐసీసీ ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించదని భావిస్తున్నాను. ఎందుకంటే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను క్రికెట్ గురించి తెలుసు ఓ మెధావి అతను ఎట్టి పరిస్థితుల్లో దీనీనీ అంగీకరించడని భావిస్తు్న్నాను. సంప్రదాయ క్రికెట్ చంపాలని సౌరవ్ గంగూలీ భావించడని అభిప్రాయపడుతున్నా అని పేర్కొన్నారు.

ఇటీవలే ఈ ప్రతిపాదనను పలువురు క్రికెటర్లు వ్యతిరేకించారు. మొదట దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సిడిల్ దీనిపై స్పందించారు. నాలుగు రోజుల టెస్టుల్లో డ్రాలు తప్ప విజయాలు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీలంకతో తొలి టీ20కి ముందు మీడియా సమావేశంలో దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించారు. డే/నైట్ టెస్టు్ల్లో విజయవంతమైన నేపథ్యంలో వాటిలో మార్పులు చేయండి అంతే కానీ ఐదు రోజుల టెస్టు క్రికెట్ సంపొద్దని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

2017లోనూ సౌతాణాఫ్రికా, జింబాబ్వేలు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌ నిర్వహించింది. ఈ మ్యాచ్‌‌లు సక్సెస్ కావడంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. క్రికెట్ ఆడే పలు దేశాల్లో టీ20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని టెస్టు మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అయితే పలువురు ఆటగాళ్లు ఇప్పటికే దీనిపై పెదవి విరుస్తున్నారు.


Full View


Tags:    

Similar News