Shoaib Akhtar praised Sourav Ganguly : దాదాను పొగడ్తలతో ముంచెత్తిన అక్తర్!

Shoaib Akhtar praised Sourav Ganguly : భారత ఆటగాళ్ళపై నిత్యం ఎదో వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌

Update: 2020-08-11 11:12 GMT
Akhtar , Ganguly

Shoaib Akhtar praised Sourav Ganguly : భారత ఆటగాళ్ళపై నిత్యం ఎదో వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.. తాజాగా ఇండియన్ టీం మాజీ ఆటగాడు, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు ఈ ఫాస్ట్ బౌలర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా భారత్‌-పాక్‌ జట్లకు ఆడుతున్న రోజుల్లోని ఫోటోను షేర్ చేస్తూ కొన్ని వాఖ్యలు చేశాడు అక్తర్ ..

" నాకు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలంటే చాలా ఇష్టం. నేను ఆడే రోజుల్లో ఏ జట్టు మీదైనా పోటీపడేందుకైనా సిద్దపడేవాడిని.. అలాగే నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థుల్లో గంగూలీ ఒకరు. అతను కేవలం బలమైన ప్రత్యర్థే కాదు.. అంతకుమించిన కెప్టెన్‌ కూడా... నేను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున అతని కెప్తెన్సీలో ఆడినందుకు సంతోషపడుతున్నాను " అని అక్తర్ పేర్కొన్నాడు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఐపీఎల్ మొదటి సీజన్ లో మాత్రమే అక్తర్ ఆడాడు.. ఆడిన అయిదు మ్యాచ్ లో మొత్తం అయిదు వికెట్లు తీశాడు..

ఇక గంగూలీ విషయానికి వచ్చేసరికి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఇరుక్కొని సతమతం అవుతున్న సమయంలో జట్టు పగ్గాలను తీసుకున్నాడు గంగూలీ.. తన నాయకత్వంలో భారత జట్టు అనేక విజయాలను అందుకుంది.. ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఆసీస్, శ్రీలంక లాంటి జట్లను మట్టికరిపించింది.. ఇక యువ క్రికెటర్ లను బాగా ఎంకరేజ్ చేశాడు గంగూలీ.. జహీర్ ఖాన్, యువరాజ్, ధోని, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్ళు దాదా కెప్టెన్సీ లోనే జట్టులోకి వచ్చారు.



Tags:    

Similar News