Shoaib Akhtar : కోహ్లి భారతీయుడు అయినందుకే ద్వేషించాలా : అక్తర్

Shoaib Akhtar : పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్రికెట్‌ వ్యవహారాలు, ఆటగాళ్లపై

Update: 2020-09-03 08:51 GMT

virat kohli, Shoaib Akhtar

Shoaib Akhtar : పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్రికెట్‌ వ్యవహారాలు, ఆటగాళ్లపై తన అభిప్రాయాలను వక్తం చేస్తుంటాడు... అందులో భాగంగానే పలుమార్లు భారత ఆటగాళ్ళు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ల పైన ప్రశంశలు కురిపించాడు ఈ మాజీ ఆటగాడు.. తనకు నచ్చితే ఎవరైనా ఒక్కటే అన్న సిద్దాంతాన్ని బలంగా నమ్ముతాడు అక్తర్.. అయితే అక్తర్ తీరు పట్ల పాకిస్థాన్‌లో కొందరు అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. అంతేకాకుండా అక్తర్ పై తీవ్ర విమర్శలు చేస్తారు.. అయితే తాజాగా ఓ క్రికెట్ ఛానల్ లో పాల్గొన్న అక్తర్ కి ఇదే ప్రశ్న ఎదురైంది.. దీనికి అక్తర్ ధీటుగా సమాధానం ఇచ్చాడు.

ప్రపంచ క్రికెట్‌లో భారత కెప్టెన్ కోహ్లి అత్యత్తమ ఆటగాడని అతడు నెలకొల్పిన రికార్డులే చెబుతున్నాయని అన్నాడు.. అతి తక్కువ కాలంలోనే 70 అంతర్జాతీయ సెంచరీలను సాధించడం చాలా గ్రేట్ అని, అలా ఎవరు సాధించలేరని, అలాంటప్పుడు అతగాడిని పొగిడితే తప్పేంటి అని అన్నాడు.. అనవసరంగా పాక్ అభిమానులు తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని అన్నాడు. ' విరాట్ కోహ్లి కేవలం భారతీయుడు అయినందుకే అతన్ని ద్వేషించాలా? మనం వాళ్లని పొగడకూడదా? అని ప్రశ్నించాడు.. భారత క్రికెట్ జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్ అద్భుతంగా రాణిస్తున్నారని కితాబు ఇచ్చాడు అక్తర్..

అటు షోయబ్‌ అక్తర్‌ ఒంటి చేత్తో పాకిస్తాన్ కి ఎన్నో విజయాలను అందించాడు.. గంటకి 161.3 వేగంతో బంతిని విసిరి ఫాస్టెస్ట్ బౌలర్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు అక్తర్‌.. ఇప్పటికి ఆ రికార్డు అక్తర్ పేరు పైనే ఉంది. పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు ఆడిన అక్తర్.. టెస్ట్ మ్యాచుల్లో 178, వన్డేల్లో 247 వికెట్స్ తీసుకున్నాడు. 15 టీ20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. 

Tags:    

Similar News