IPL 2021: కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంకా లక్షణాలు పోలేదు

IPL: ఐపీఎల్ 14వ సీజ‌న్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా అర్థాంత‌రంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Update: 2021-05-22 17:15 GMT

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (క్రిక్ ఇన్ఫో)

IPL: ఐపీఎల్ 14వ సీజ‌న్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా అర్థాంత‌రంగా ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. బ‌యోబుడ‌గ నీడ‌లో జ‌రుగుత‌న్న ఈ టోర్నీలో క‌రోనా వైర‌స్ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అంద‌రికంటే ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి కరోనా సోకింది. తాజాగా క‌రోనా నుంచి కోలుకున్నా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఇంకా బలహీనంగా ఉన్నానని చెప్పాడు. అలాగే ఇప్పటికీ రుచీ, వాసన కూడా కోల్పోతున్నానని తెలిపాడు. తర్వాత వరుణ్‌కు నెగిటివ్‌గా వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదన్నాడు.

ఈ సందర్భంగా కోల్‌కతా బౌలర్‌ వైరస్‌ బాధితులకు పలు సూచనలు చేశాడు. కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదు. 'కరోనా నుంచి కోలుకున్నా కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. అది క్రీడాకారులైనా, మరెవరైనా కావచ్చు. మీకు నెగిటివ్‌ వచ్చినా కచ్చితంగా మాస్క్‌ ధరించండి. అది మీ చుట్టూ ఉండేవాళ్లకు రక్షణగా ఉంటుంది. 'ప్రస్తుతం నేను ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నా. శారీరకంగా బలహీనంగా ఉండటంతో ప్రాక్టీస్‌ చేయడం లేదు.అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా. కానీ, త్వరలోనే ట్రైనింగ్‌ ప్రారంభిస్తా'నని వరుణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

అలాగే వైరస్‌ బారిన పడినప్పుడు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో కంగారు పడ్డా. నా గురించే కాకుండా దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ఆందోళన చెందా. అదంత తేలికైన విషయం కాదు. కానీ, ఒక ఆటగాడిగా త్వరగా కోలుకోవాలనే మార్గాలను అన్వేషించా. ముఖ్యంగా బయటి విషయాలను అస్సలు పట్టించుకోవద్దు' అని వరుణ్‌ వివరించాడు. ఇక తనకు వైరస్‌ సోకినప్పుడు ఏం జరిగిందనే విషయాలను సైతం ఇలా చెప్పుకొచ్చాడు. 

'మే 1న కాస్త ఇబ్బందిగా అనిపించడంతో పాటు తేలికపాటి జ్వరం వచ్చింది. వెంటనే జట్టు యాజమాన్యానికి విషయం తెలియజేసి ట్రైనింగ్‌ సెషన్‌కు వెళ్లలేదు. తర్వాత ఆటగాళ్లందరికీ దూరంగా ఉన్నా.మా ఫ్రాంఛైజీ కూడా ఎంతో అండగా నిలిచింది. ఐపీఎల్ వాయిదా పడ్డా నాతో ఒకరిని తోడుగా ఉంచింది. చివరికి రెండు సార్లు నెగిటివ్‌ ఫలితం వచ్చాకే ఇంటికి పంపించారని వరుణ్‌ చక్రవర్తి తెలిపాడు. షారుఖ్‌ఖాన్‌ కేకేఆర్  ఆటగాళ్లందరితో ప్రత్యేకంగా మాట్లాడి ధైర్యం నింపారు అని వరుణ్‌ గుర్తుచేసుకున్నాడు.

Tags:    

Similar News