Sania Mirza: కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా
Sania Mirza: టెన్నిస్ ఆటకు గుడ్‌బై చెప్పిన సానియా మీర్జా
Sania Mirza: కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన గ్రాండ్ స్లామ్ జర్నీని ఓటమితో ముగించింది. గ్రాండ్ స్లామ్ కెరీర్‌లో చివరిదైన ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో ఓడిపోయిది. ఈ ఓటమితో సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికినట్లయింది. అయితే కెరీర్‌ను ముగిస్తున్నట్లు గతంలో సానియా మీర్జా ప్రకటించింది. ఇదే తన మ్యాచ్ అని కూడా అప్పట్లోనే తెలిపింది. అయితే గెలుపుతో ఆటకు గుడ్ బై చెప్పాలనుకున్న సానియా మీర్జా ఆశలు కాస్తా ఈ ఓటమితో ఆవిరయ్యాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో ఓడిపోయినప్పుడు సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇదే తన చివరి ఆట కావడంతో..కన్నీటి పర్యంతమైంది. చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన బ్రెజిల్ జోడీని సానియా అభినందించింది. అయితే ఇన్నాళ్లూ తనను ఆదరించిన ప్రేక్షుకులందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సానియా ప్రకటించింది. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ సానియా కన్నీటి పర్యంతమైంది. ఈ ఆటతో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించి తీవ్ర భావోద్వేగానికి లోనైంది సానియా మీర్జా. 2005లో హైదరాబాద్ వేదికగా జరిగిన WTA వరల్డ్ టైటిల్‌ను గెలిచి మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2009లో మహేష్ భూపతితో కలిసి సానియా మీర్జీ తన తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. మొత్తం ఇప్పటివరకు 43 డబుల్స్ టైటిళ్లను సానియా గెలిచింది. అయితే మహిళల డబుల్స్ విభాగంగా 91 వారాల పాటు WTA ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో సానియా మీర్జా కొనసాగింది.
సానియా మీర్జా టెన్నిస్ ఆటలోనే కాదు..వివాదాల్లోనూ క్వీన్‌గానే నిలిచింది. ఆమె ఆటతో పాటు వివాదాలతోనూ సానియా సావాసం చేసింది. వాటితోనే పాపులర్ కూడా అయింది. ఆటలో భాగంగా ఆమె వేసుకున్న డ్రెస్సులు కూడా పెద్ద కాంట్రవర్సీగా మారాయి. అందరిలాగే సానియా కూడా స్కర్ట్‌లు వేసుకొని బరిలోకి దిగగా..ఇది నచ్చని ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీ చేయడం అప్పట్లో పెను సంచలనం రేపింది. అయితే అవేమీ పట్టించుకోకుండా సానియా తన ఆటమీదే దృష్టిపెట్టి సత్తా చాటింది. ఆ తర్వాత 2008లో టెన్నిస్ మ్యాచ్‌ను చూస్తూ తన కాళ్లను ఎదురుగా ఉన్న టేబుల్‌పై ఉంచింది. అదే టేబుల్‌పై భారత జాతీయ పతాకం ఉండగా..ఆమె కాళ్లు జాతీయ పతాకాన్ని తాకుతున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. సానియా మీర్జా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతిపెద్ద వివాదం కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత 2012లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి సానియా మీర్జా మరో వివాదానికి తెరలేపింది.