Modi: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారో తెలిస్తే వావ్ మోదీజీ అంటారు
Modi About India Pakistan Cricket: క్రికెట్ లో చిరకాల ప్రత్యర్థులుగా ఉండే ఇండియా, పాకిస్తాన్ జట్లలో ఏది ఉత్తమమైంది? అనే ప్రశ్నకు ప్రధానమంత్రి మోదీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. క్రికెట్లో తనకు అంతగా అవగాహన లేదని..అయితే మెరుగైన జట్టు ఏదనేది ఇటీవలి ఫలితాలే నిరూపించాయన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ప్రజలను ఏకతాటిపై తీసుకురావడంలతో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ సందర్బంగా అన్నారు.
నేను క్రికెట్ ఎక్స్ పర్ట్ కాదు..ఈ ఆటలోని మెళకువలు కూడా నాకు అంతగా తెలియవు. కేవలం ఆటపై అవగాహన ఉన్నవారు మాత్రమే ఏది బెస్ట్ టీమ్ అనేది విశ్లేషిస్తారు. కొన్ని రోజుల క్రితం భారత్ పాక్ మ్యాచ్ జరిగింది. ఏది మెరుగైన జట్టు అనేది ఆ మ్యాచ్ ఫలితమే తేల్చి చెప్పింది అని ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టును ఉద్దేశించి ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచే శక్తి క్రీడలకు ఉందని భావిస్తున్నానని..పలు దేశాల ప్రజలను క్రీడాస్ఫూర్తి ఏకతాటిపైకి తీసుకువస్తుందన్నారు. అందుకే క్రీడలను తక్కువ అంచనా వేయకూడదన్నారు. మానవ పరిణామ క్రమంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని బలంగా నమ్ముతాను అని ప్రధాని మోదీ చెప్పారు. అవి ప్రజల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరుస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.