Rashid Khan: ఆ ఘనత సాధించడమే మా అతి పెద్ద లక్ష్యం: రషీద్ ఖాన్
Rashid Khan: టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్నాడు. తమ జట్టు ఆ ఘనత సాధించాలని యావత్ అఫ్గానిస్థాన్ ఆశిస్తోందన్నాడు
Rashid Khan: Our dream is to win the T20 World Cup
Rashid Khan: టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్నాడు. తమ జట్టు ఆ ఘనత సాధించాలని యావత్ అఫ్గానిస్థాన్ ఆశిస్తోందన్నాడు. తాజాగా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్ లో రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తమ జట్టు తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచకప్ గెలవడమనీ, ఈ ఘనత సాధించాలని యావత్ దేశం ఆశిస్తున్నదనీ, ఎందుకంటే టైటిల్ గెలవగలే సామర్థ్యం, నైపుణ్యం మా జట్టుకు ఉందని అన్నారు. ఇది సాధించగలమనే నమ్మకం ఉంది. మా జట్టులో టాలెంటెడ్ స్పిన్నర్లు, పేసర్లు, బ్యాట్స్మెన్ ఉన్నారు. అయితే మేం రెగ్యులర్గా టాప్ జట్లతో ఆడాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మేం మరింత అత్యుత్తమంగా తయారవుతాం. ఏదో ఒకరోజు టీ20 ప్రపంచకప్ గెలుస్తాం. ఇదే మా కల. ఆ కలను సాకారం చేసుకునేలా కృషిచేస్తాం. ఆ క్షణమే అఫ్గాన్ క్రికెట్‌కు, మాకు అతిపెద్ద విజయం దక్కినట్లు అని రషీద్ ఖాన్ చెప్పారు.
రెండేండ్లుగా ఆఫ్ఘన్ జట్టులో టీ20 స్పెషలిస్టులు పెరిగిపోతున్నారు. ఆ జట్టు నుంచి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ముజీబుర్ రహ్మాన్ ఆడుతున్న సంగతి తెలిసిందే.