Top
logo

IPL 2020: షార్జా స్టేడియంలో బీసీసీఐ బాస్‌

IPL 2020:  షార్జా స్టేడియంలో బీసీసీఐ బాస్‌
X

Sourav Ganguly visists Sharjah Cricket Stadium

Highlights

IPL 2020: ప్రపంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2020 ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. తొలి మ్యాచ్ రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది.

IPL 2020: ప్రపంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2020 ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. తొలి మ్యాచ్ రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లన్నీ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరగనున్నాయి. ఈ క్ర‌మంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాడు.

ఈ నెల‌ 9న యూఏఈ చేరుకున్న సౌరవ్‌ గంగూలీ నిబంధనల ప్రకారం ఆరు రోజల క్వారంటైన్‌లో ఉన్నాడు. తాజాగా క్వారంటైన్‌ ముగియడంతో ఐపీఎల్ ఏర్పాట్ల‌ను పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా మంగ‌ళ‌వారం ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌, ​సీవోవో హేమంగ్‌ అమిన్‌తో కలిసి గంగూలీ షార్జా స్టేడియం పరిసరాలను సందర్శించాడు. స్టేడియంలో కొత్తగా నిర్మించిన వసతులపై దాదా సంతృప్తి వ్యక్తం చేశాడు.

సౌరవ్ గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షార్జా స్టేడియం ఫోటోలను షేర్‌ చేశాడు. 'షార్జా స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఐకానిక్‌ స్టేడియంలో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఐపీఎల్‌ ద్వారా భారత యువ ఆటగాళ్లు షార్జా స్టేడియంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత దిగ్గజాలు సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ లాంటి ఆటగాళ్లకు కూడా ఈ స్టేడియంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి' అని ట్వీట్ చేశాడు.

View this post on Instagram

Famous Sharjah stadium all set to host IPL 2020

A post shared by SOURAV GANGULY (@souravganguly) on


Web TitleIPL 2020: BCCI boss Sourav Ganguly visits Sharjah Cricket Stadium,
Next Story