IPL 2020 live broadcast: పాకిస్థాన్‌లో తప్ప‌.. 120 దేశాల్లో ఐపీఎల్ ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలు

IPL 2020 live broadcast:  పాకిస్థాన్‌లో తప్ప‌.. 120 దేశాల్లో ఐపీఎల్ ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలు
x

IPL 2020 live broadcast 

Highlights

IPL 2020 live broadcast: ప్ర‌పంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ‌ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మరో ఐదు రోజుల్లో యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది.

IPL 2020 live broadcast: ప్ర‌పంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ‌ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మరో ఐదు రోజుల్లో యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రికెట్ లీగ్‌కు అత్యంత ఆదరణ ఉంది. కానీ, క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్‌ను ప్ర‌త్యేక్షంగా చూసే అవ‌కాశం ఈ సారి అభిమానుల‌కు లేదు. కేవ‌లం ప్ర‌త్యేక్ష ప్ర‌సారాల ద్వారానే తిల‌కించ‌వ‌చ్చు. దీంతో ప్రేక్షకులకు చేరవేసేందుకు బీసీసీఐ ఇప్పటికే పలు ప్రసారకర్తలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

భారత ఉపఖండంలో ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో క్రికెట్ ప్రసారాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐసీసీ అనుబంధ సభ్యులుగా ఉన్న ప్రతీ దేశంలో ఐపీఎల్ ప్రసారం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి తగినట్లుగా ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తున్నది. క‌రోనా నేప‌థ్యంలో కేవలం టీవీల్లోనే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వెబ్ స్ట్రీమింగ్ కూడా చేయబోతున్నట్లు స్టార్ గ్రూప్ ప్రతినిధి తెలిపాడు.

ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఐపీఎల్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు భారత ప్రాంతీయ భాషల్లో వేర్వేరుగా ప్రసారం చేయనున్నారు. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ప్రాంతీయ భాషా ఛానెల్స్‌లో ప్రతీ రోజు ప్రసారాలు ఉంటాయి. పాక్ క్రికెట్ అభిమానుల‌కు షాక్ తగిలింది. ఆ దేశంలో ఐపీఎల్ ప్ర‌సారాలు లేవ‌ని తెల్చి చెప్పింది. అక్కడి ప్రభుత్వం అనుమతించక పోవడమే కారణమని స్టార్ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories