Team India Next captain: టీమిండియా తర్వ‌త సార‌థి కేఎల్ రాహులే!: ఆకాశ్‌ చోప్రా

Team India Next captain: టీమిండియా తర్వ‌త సార‌థి కేఎల్ రాహులే!: ఆకాశ్‌ చోప్రా
x

Team India Next captain

Highlights

Team India Next captain: దుబాయి వేదిక‌గా ఐపీఎల్2020 క్రీడా స‌మరం త‌ర్వ‌లో ప్రారంభం కానున్నది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ క్రికెట్ విశ్లేష‌కుడు, మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ఆసక్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Team India Next captain: దుబాయి వేదిక‌గా ఐపీఎల్2020 క్రీడా స‌మరం త‌ర్వ‌లో ప్రారంభం కానున్నది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ క్రికెట్ విశ్లేష‌కుడు, మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ఆసక్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొనే సరికి కేఎల్‌ రాహుల్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్దంగా ఉంటార‌ని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈసారి ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకముంద‌ని ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తాడనే విషయాలపై స్పష్టత వస్తుందని వివరించాడు.

కోహ్లీ, రోహిత్‌ ఒకే వయసు కలవారని, ఒక స్థాయికి వచ్చేసరికి వారిద్దరూ కెప్టెన్లుగా కనిపించరని మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు. కెప్టెన్సీ విషయంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎలాగైతే జట్టు పగ్గాలను కోహ్లీకి అప్పగించాడో.. అలాగే అతడు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి ఇవ్వక తప్పదని చెప్పాడు. అప్పుడు రాహుల్‌ మాత్రమే ముందు వరుసలో ఉంటాడన్నాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ కెప్టెన్‌గా ఎలా పనికొస్తాడనే విషయం ఈ ఐపీఎల్‌తో తెలుస్తుందని చోప్రా అన్నాడు. ఇప్పటివరకూ అతడి ఆట, వ్యవహారశైలిని బట్టి కెప్టెన్‌గా రాణిస్తాడనే నమ్మకంతో ఉన్నానన్నాడు. మంచి సారథిగా గుర్తింపు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories