David Warner: వార్న‌ర్‌కు నిరూపించుకునే టైం వ‌చ్చింది: ఆకాశ్ చోప్రా

David Warner: వార్న‌ర్‌కు నిరూపించుకునే టైం వ‌చ్చింది: ఆకాశ్ చోప్రా
x

David Warner

Highlights

David Warner: డెవిడ్ వార్న‌ర్ ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్‌.. ఐపీఎల్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లేయ‌ర్ అని కూడా చెప్పొచు. ఐపీఎల్ సీజ‌న్‌లో అత్యుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న కానబ‌రుస్తున్న మేటీ ఆట‌గాడు.

David Warner : డెవిడ్ వార్న‌ర్ ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్‌.. ఐపీఎల్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లేయ‌ర్ అని కూడా చెప్పొచు. ఐపీఎల్ సీజ‌న్‌లో అత్యుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న కానబ‌రుస్తున్న మేటీ ఆట‌గాడు. ప్ర‌స్తుతం వార్న‌ర్ గురించి ఇండియ‌న్ మాజీ ఫ్లేయ‌ర్ ఆకాశ్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ టోర్నమెంట్‌ ప్రొటెక్టర్‌గా డేవిడ్‌ వార్నర్‌ పేరును వెల్లడించాడు. జట్టు ఎలాంటి స్థితిలో ఉన్నా విజయ తీరాలకు చేరుస్తాడని, తన బ్యాటింగ్‌తో నిలకడగా రాణిస్తూ ఐపీఎల్‌ టోర్నీలోనే ప్రత్యేక గుర్తింపు సాధించాడని పేర్కొన్నాడు.

గత సీజన్‌లో టోర్నీ ఆరంభానికి ముందే 500 పరుగులు చేస్తానని చెప్పిన వార్నర్‌ అంతకన్నా ఎక్కువ పరుగులే చేశాడన్నాడు. విదేశీ ఆటగాళ్లలో ఆల్‌టైమ్‌ అత్యుత్తమ క్రికెటర్‌ అని ప్రశంసించాడు. అయితే, ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఉపఖండంలో టెస్టు క్రికెట్‌లో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేడని, కానీ ఐపీఎల్‌లో మాత్రం వారిపై రెచ్చిపోయి ఆడతాడని చెప్పాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ను కూడా చిత్తుచేస్తాడని వివరించాడు. తొలి 6 ఓవర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తాడని చోప్రా అన్నాడు. ఈ సందర్భంగానే సన్‌ రైజర్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌ నిరూపించుకోవాల్సి ఉందని చెప్పాడు. ఇప్పుడు అతడిపై మరింత భారం పెరిగిందని పేర్కొన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఇకపై ఆస్ట్రేలియా కెప్టెన్‌గా అతడు ఎంపికయ్యే అవకాశం లేదని ఇప్పటికే ఆ జట్టు భావిస్తోందని, దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌లో విజయం సాధించి కెప్టెన్సీ విషయంలో కంగారూలు తప్పు చేశామని అనుకునేలా చేయాలని అనుకుంటున్నాడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియ‌న్ అధికారులు త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్న‌మ‌నేలా .. త‌న‌ని తాను నిరూపించుకోవాల‌ని, ఆ ఛాయిస్ కేవ‌లం ఐపీఎల్‌లోనే దొరుకుతుండ‌ని ఆకాశ్ చోప్రా సూచించారు. ఈ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ జట్టు బలాబలాలపై స్పందించాడు.

టాప్‌ ఆర్డర్‌లో డేవిడ్‌వార్నర్‌, బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్స్‌లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అలాగే బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ లాంటి వారు ఉన్నారు. వీళ్లంతా మ్యాచ్‌ విన్నర్లు. కలిసికట్టుగా ఆడితే కచ్చితంగా గెలుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories