Yuvraj Singh: యువీ రీఎంట్రీ క‌ష్ట‌మేనా?!

Yuvraj Singh: యువీ రీఎంట్రీ క‌ష్ట‌మేనా?!
x

Yuvraj Singh’s ‘comeback

Highlights

Yuvraj Singh: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. ఈ మేర‌కు బీసీసీఐకి కూడా లేఖ రాశారు. కానీ అత‌ని పునరాగమనానికి బ్రేక్‌లు ప‌డ‌నున్నాయి

Yuvraj Singh: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. ఈ మేర‌కు బీసీసీఐకి కూడా లేఖ రాశారు. కానీ అత‌ని పునరాగమనానికి బ్రేక్‌లు ప‌డ‌నున్నాయి. గ‌తేడాది జూన్‌లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌తో ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అనంత‌రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఎన్ ఓసీ ప‌త్రాన్ని కూడా పొందారు.

అనంత‌రం రెండు విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడేశాడు.కానీ.. ఇటీవ‌ల పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ పునీత్ బలి అభ్యర్థన మేరకు తాను రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలని, దేశవాళీలో మళ్లీ తాను పంజాబ్ తరఫున ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి కోరుతూ మెయిల్‌ పంపిన యువరాజ్ సింగ్... అతని సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు.

కానీ.. అతని రీఎంట్రీ కష్టమేనని తాజాగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత బీసీసీఐ నుంచి యువరాజ్‌ వన్‌టైమ్‌ బెన్‌ఫిట్‌ అందుకున్నాడు. రూ. 22, 500 పెన్షన్‌ను కూడా గత ఏడాది నుంచి యువీ తీసుకుంటన్నాడు. బీసీసీఐ రికార్డుల్లో యువీ రిటైర్మెంట్‌ చేరిపోయింది. ఫలితంగా బీసీసీఐ నిబంధనలు బోర్డుకు సంబంధించిన రాష్ట్ర అసోసియేషన్‌లో కానీ యువీ తిరిగి ఆడటానికి అనుమతించవు. దీనిపై తుది నిర్ణయం బోర్డుదే' అని సదరు అధికారి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories