Virat Kohli: ఐపీఎల్ సమరానికి సై అంటున్న కోహ్లీ.. వీడియో వైరల్


Kohli gets his weapons battle-ready for IPL 2020
Virat Kohli: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరోవారం రోజుల్లో ప్రారంభం కానున్నది. అన్ని జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో మునిగిపోయారు
Virat Kohli: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరోవారం రోజుల్లో ప్రారంభం కానున్నది. అన్ని జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో మునిగిపోయారు. ఐపీఎల్ కోసం కెప్టెన్ కోహ్లి కూడా నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఐపీఎల్ 2020 ఈనెల 19న నుంచి ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 21న ఆర్‌సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడనున్నది.
ఇదిలా ఉండగా శుక్రవారం విరాట్ కోహ్లి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు. అందులో తానే స్వయంగా తన బ్యాట్ ను బాగుచేసుకుంటున్నాడు. "బ్యాట్ సమతుల్యతకు నాకు రెండు సెంటీమీటర్లు కూడా చాలా ముఖ్యమైనది. నా బ్యాట్‌లను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం" అని కోహ్లీ ట్విట్టర్‌లో తన పోస్ట్‌కు క్యాప్షన్ చేశారు. అయితే ఈ వీడియో పై స్పందించిన ముంబై ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా విరాట్ సహాయం కోరాడు. ''నా బ్యాట్స్ ను ని దగ్గరకు పంపిస్తా.. బాగుచేయవ'' అని అడిగాడు.
It's the small details that matter 👌. For me even couple of centimeters are crucial for the balance of a bat. I LOVE taking care of my bats 😍 pic.twitter.com/oJ4Tqk5UfP
— Virat Kohli (@imVkohli) September 11, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



