Pat Cummins Becomes Father Again he Welcomes Baby Girl with Wife Becky
Pat Cummins : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. అతని భార్య బెక్కీ కమిన్స్ (Becky Cummins) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను పాట్ కమిన్స్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోను షేర్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకున్నారు.
సోషల్ మీడియాలో హ్యాపీ మోమెంట్‌ను కమిన్స్ పోస్ట్ చేశారు. తను తన భార్య బెక్కీతో కలిసి ఓ క్యూట్ ఫోటోను పోస్ట్ చేస్తూ –"ఆమె వచ్చేసింది! మా అందమైన బేబీ ఎడీ (Eddie). ఈ క్షణాన్ని మాటల్లో వర్ణించలేం. ప్రేమతో, ఆనందంతో మా హృదయాలు నిండిపోయాయి." అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. బెక్కీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తమ కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పాట్ కమిన్స్, బెక్కీ 2020లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీని ముందు వారు చాలా ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. 2022 ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. అయితే పెళ్లికి ముందే, 2021 అక్టోబర్‌లో ఈ జంట ఓ కుమారుడు ఎల్బీ (Albie)కి జన్మనిచ్చారు.
శ్రీలంక టూర్‌కు దూరమైన కమిన్స్
కమిన్స్ తన రెండో బిడ్డ పుట్టిన సందర్భంగా క్రికెట్ నుండి తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఈ కారణంగా అతను శ్రీలంక టూర్‌కు వెళ్లడం మానేశాడు. పైగా, ప్రస్తుతం అతను మోకాలి గాయం సమస్యతో కూడిన చికిత్స తీసుకుంటున్నాడు. కమిన్స్ గాయపడి ఉండటంతో, అతను 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం లేదు. ప్రాథమికంగా ఆస్ట్రేలియా జట్టులో అతనికి స్థానం ఇచ్చినా, అనంతరం వైదొలగించే నిర్ణయం తీసుకున్నారు.
ఆస్ట్రేలియా కెప్టెన్సీ ఎవరికీ?
కమిన్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో స్టీవ్ స్మిత్ (Steve Smith) లేదా ట్రావిస్ హెడ్ (Travis Head) లో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశముంది. ఫిబ్రవరి 12న క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త జట్టును అధికారికంగా ప్రకటించనుంది.