Padma Awards 2026 Sports Winners List: క్రికెట్ దిగ్గజాలకు పద్మ గౌరవం... రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ.. విజయ్ అమృతరాజ్‌కు పద్మభూషణ్!

Padma Awards 2026 Sports Winners List: భారత క్రికెట్ స్టార్స్ రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ పురస్కారం వరించింది. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్‌కు పద్మభూషణ్ దక్కింది. 2026 క్రీడా విభాగం పద్మ అవార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-01-25 15:31 GMT

Padma Awards 2026 Sports Winners List: క్రికెట్ దిగ్గజాలకు పద్మ గౌరవం... రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ.. విజయ్ అమృతరాజ్‌కు పద్మభూషణ్!

Padma Awards 2026 Sports Winners List: భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల (Padma Awards 2026) జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందించిన పలువురు స్టార్ ఆటగాళ్లను కేంద్రం గౌరవించింది. ఈ జాబితాలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తమ ప్రతిభకు తగ్గ గుర్తింపును సాధించారు.

హిట్ మ్యాన్ కు పద్మశ్రీ: భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. రోహిత్ సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రోహిత్ కు ఈ అవార్డు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం: మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఆమె సారథ్యంలో గతేడాది భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను గుర్తించిన ప్రభుత్వం ఆమెను ఈ గౌరవంతో సత్కరించింది.

క్రీడా విభాగంలో ఇతర విజేతలు:

విజయ్ అమృతరాజ్ (టెన్నిస్): దేశంలోని మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది క్రీడా విభాగం నుంచి పద్మభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి ఈయనే కావడం విశేషం.

సవితా పూనియా (హాకీ): భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ 'ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా' సవితా పూనియాకు పద్మశ్రీ లభించింది.

ప్రవీణ్ కుమార్ (పారా స్పోర్ట్స్): పారా హైజంపర్ ప్రవీణ్ కుమార్ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

మొత్తం అవార్డుల లెక్క: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన ఈ జాబితాలో మొత్తం 131 మంది విజేతలు ఉన్నారు. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, మరియు 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 19 మంది మహిళలు, 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు ప్రకటించారు.

Tags:    

Similar News