7 వికెట్ల తేడాతో విజయక్రాంతి జట్టుపై విజయం సాధించిన హెచ్ఎంటివి

ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య కిషన్ రెడ్డి గారు

Update: 2026-01-25 10:35 GMT

7 వికెట్ల తేడాతో విజయక్రాంతి జట్టుపై విజయం సాధించిన హెచ్ఎంటివి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనతో, దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న PM సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026 లో భాగంగా జింఖానా గ్రౌండ్ లో జరిగిన మీడియా క్రికెట్ లీగ్ రెండవ రోజు మొదటి మ్యాచ్ లో Hmtv విజయక్రాంతి మధ్య జరిగిన హారహోరి పోరులో Hmtv ఏడు వికెట్ల తేడాతో విజయ్ క్రాంతి జట్ పై విజయం సాధించింది 30 ఉత్తమ ప్రదర్శన కనబరిచిన Hmtv కెప్టెన్ రమణకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

జింఖానా గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య కిషన్ రెడ్డి గారు హాజరయ్యారు ఈ సందర్బంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచి HMtV జట్టుకు విజయాన్ని అందించిన కెప్టెన్ రమణకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందించారు.

అనంతరం కావ్య కిషన్ రెడ్డి గారు రెండవ మ్యాచ్ సుమన్ టీవీ - ఐ న్యూస్ మ్యాచ్ టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.

Tags:    

Similar News