Palash Muchhal: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు

Palash Muchhal: ప్రముఖ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, గాయకుడు మరియు ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Update: 2026-01-23 07:07 GMT

Palash Muchhal: ప్రముఖ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, గాయకుడు మరియు ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద భారీగా నగదు తీసుకుని మోసం చేశారంటూ సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 40 లక్షల మేర ఆర్థిక మోసం జరిగిందంటూ బుధవారం సాంగ్లీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందజేయడం సంచలనంగా మారింది.

పరిచయం కాస్తా మోసానికి దారితీసిందిలా.. వృత్తిరీత్యా సినీ ఫైనాన్షియర్ అయిన వైభవ్ మానే, స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు. గతంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ద్వారా పలాశ్ ముచ్చల్‌తో వైభవ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను 'నజరియా' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానని, పెట్టుబడి పెడితే ఓటీటీ వేదికగా విడుదల చేసి త్వరగా లాభాలు అందిస్తానని పలాశ్ నమ్మబలికారు. పలాశ్ మాటలను విశ్వసించిన వైభవ్, పలు విడతలుగా నగదు రూపంలో మరియు గూగుల్ పే ద్వారా మొత్తం రూ. 40 లక్షలు చెల్లించారు.

ఫోన్ నంబర్ బ్లాక్.. తప్పనిసరి పరిస్థితుల్లో ఫిర్యాదు నిర్మాణ దశలో ఉన్న సినిమా మధ్యలోనే నిలిచిపోవడంతో, తన డబ్బు తిరిగి ఇవ్వాలని వైభవ్ కోరారు. మొదట ఇస్తానని చెప్పిన పలాశ్, ఆ తర్వాత వైభవ్ కాల్స్‌కు స్పందించడం మానేశారు. చివరికి బాధితుడి నంబర్‌ను బ్లాక్ చేయడంతో, తాను మోసపోయానని గ్రహించిన వైభవ్ పోలీసులను ఆశ్రయించారు. నగదు లావాదేవీలకు సంబంధించిన రశీదులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించారు.

పోలీసుల దర్యాప్తు బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన సాంగ్లీ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. వైభవ్ సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే పలాశ్ ముచ్చల్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో స్మృతి మంధానతో పలాశ్ వివాహం రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శ్రేయాస్ తల్పడేతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News