IND VS NZ: భారత్ దూకుడు.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 348 పరుగులు..

న్యూజిలాండ్ తో జరుగుతున్నా మొదటి వన్డేలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.

Update: 2020-02-05 06:03 GMT

న్యూజిలాండ్ తో జరుగుతున్నా మొదటి వన్డేలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. అర్ధ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 51(63) సోధీ బౌలింగ్లో పెవిలియన్ బాటపట్టారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఒన్డే లో 58వ అర్థ శతకాన్ని నమోదుచేసుకున్నాడు. మరోవైపు నిలకడగా ఆడుతూ శ్రేయాస్ ఐయేర్ 103(105) తో తన మొదటి సెంచరీ నమోదు చేసాడు. వెంటనే సౌథీ బౌలింగ్ లో మిట్చెల్ సన్తంర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మరో వైపు కే ఎల్ రాహుల్ 88(64)తో, కేదార్ జాదవ్ 26(15)తో క్రీజులో ఉన్నారు. 50 ఓవర్లు మూగిసి సమయానికి టీం ఇండియా 347/4 పరుగులు చేసింది.

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్ డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం అయ్యాడు. టీ20 సిరీస్ ని 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసం తో ఉన్న టీం ఇండియా వన్డే సిరీస్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.




Tags:    

Similar News