శుభ్‌మన్ గిల్ బ్యాట్‌పై ‘ప్రిన్స్’ స్టిక్కర్.. ఫ్యాన్స్ ట్రోల్స్‌తో మంటలు! కోహ్లి, సచిన్ చేసిన పని కాదు అంటున్న నెటిజన్లు
టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌పై ఉన్న ‘ప్రిన్స్’ స్టిక్కర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్. కోహ్లి, సచిన్ కూడా ఇలా చేయలేదంటూ నెటిజన్ల సెటైర్లు.
శుభ్‌మన్ గిల్ బ్యాట్‌పై ‘ప్రిన్స్’ స్టిక్కర్.. ఫ్యాన్స్ ట్రోల్స్‌తో మంటలు! కోహ్లి, సచిన్ చేసిన పని కాదు అంటున్న నెటిజన్లు
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఉపయోగిస్తున్న MRF బ్యాట్‌పై ఉన్న ‘ప్రిన్స్’ స్టిక్కర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ స్టిక్కర్ చూసిన నెటిజన్లు గిల్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. "కోహ్లి, సచిన్ వంటి లెజెండ్స్ ఎప్పుడూ ఇలా చేయలేదు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
శుభ్‌మన్ గిల్ బ్యాట్‌పై ‘ప్రిన్స్’ వర్డ్.. ఎందుకు వైరల్ అవుతోంది?
భారత క్రికెట్ అభిమానులకు MRF బ్యాట్ ఓ ప్రత్యేక గుర్తింపు. సచిన్ టెండూల్కర్ (Sachin), విరాట్ కోహ్లి (Virat Kohli), బ్రియాన్ లారా (Brian Lara) లాంటి దిగ్గజాలు దీనిని వాడారు. ఇప్పుడు గిల్ కూడా అదే బ్రాండ్ బ్యాట్‌తో ఆడుతున్నాడు. కానీ అతను ఉపయోగిస్తున్న బ్యాట్‌పై ‘Prince’ అనే స్టిక్కర్ ఉండటం నెటిజన్లకు ఇష్టపడలేదనేదే నిజం.
"ఇది గర్వం కాదు?" అంటున్న అభిమానులు
టెస్టుల్లో గిల్ రికార్డులు ఆశించిన స్థాయిలో లేవు. విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా, 35 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో ఉన్న ఆటగాడికి ‘ప్రిన్స్’ అనుకోవడం ఎలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "సచిన్, కోహ్లి తమ బ్యాట్‌పై ‘God’ లేదా ‘King’ అని ఎప్పుడూ రాయించుకోలేద" అంటూ గిల్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రిన్స్ స్టిక్కర్ తొలి సారి కాదు
ఈ స్టిక్కర్ గిల్ బ్యాట్‌పై మొదటిసారి కనిపించిందేమీ కాదు. IPL 2025 సీజన్‌లోనూ అదే స్టిక్కర్ ఉన్న బ్యాట్‌తో గిల్ ఆడాడు. కానీ ఇప్పుడు టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, అదే స్టిక్కర్ వైరల్ వివాదంగా మారింది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కోసం BCCI విడుదల చేసిన ఫోటోల్లో గిల్ బ్యాట్‌పై ‘ప్రిన్స్’ స్పష్టంగా కనిపించింది.