IND vs NZ 5th T20 ‌: మ్యాచ్ మలుపు తిప్పిన సైనీ

Update: 2020-02-02 10:25 GMT

టీమిండియా కివీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లోని చివరి టీ20లో భారత్ కివీస్ ముందు 164 లక్ష్యం ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో కివీస్ ను సీఫెర్ట్(50), రాస్ టేలర్(53), ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పని చేపట్టారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 99 పరుగులు భాగస్వామ్యం అందించారు.

అయితే 13 ఓవర్ అందుకున్న సైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయి అర్థశతకం చేసిన సిఫెర్ట్(50) ను ఔట్ చేశాడు. ఇక 14 ఓవర్ బౌలింగ్ వచ్చిన బుమ్రా విచెల్ (2)న ఔట్ చేశాడు. దీంత కివీస్ 18 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మరోవైపు రాస్ టేలర్ (53) పరుగులు చేసిన అతడ్ని కూడా షైనీ అవుట్ చేశాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రా, మూడు వికెట్లు తీశాడు, సైనీ,  ఠాకూర్ , తలా రెండు వికెట్లు దక్కించున్నారు. వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. 13 ఓవర్ బౌలింగ్ చేసిన సైనీ మ్యాచ్ సెఫిర్ట్ వికెట్ తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. కివీస్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు కావాలి.

Tags:    

Similar News