టీమిండియా బౌలర్ శివమ్ దూబే చెత్త బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్ లో 34 పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ పై జరిగిన ఈమ్యాచ్‌లో పదో ఓవర్ వేసిన దూబే ఆ ఓవర్ లో 6 6 4 1 4( నోబాల్), 6 6తో మొత్తం 34 పరుగులు సమర్పించాడు. దూబే వేసిన తొలి బంతిని సీఫెర్ట్ రెండు సిక్సులు బాదాడు. అదే ఓవర్ ఆఖరి రెండు బంతులకు టేలర్ రెండు సిక్సులు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 34 పరుగులు పిండుకొని 93 పరుగులు చేసింది. అయితే 13 ఓవర్ అందుకున్న సైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయి అర్థశతకం చేసిన సిఫెర్ట్(50) ను ఔట్ చేశాడు. ఇక 14 ఓవర్ బౌలింగ్ వచ్చిన బుమ్రా విచెల్ (2)న ఔట్ చేశాడు. దీంత కివీస్ 14 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మరోవైపు రాస్ టేలర్ (46) పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Bumrah picks up his second wicket. Mitchell goes for 2.
— BCCI (@BCCI) February 2, 2020
New Zealand 119/5 after 14 overs https://t.co/3a7zBdRNm2 #NZvIND pic.twitter.com/mAySfX4fP3