Kuldeep Yadav: ఘనంగా క్రికెటర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం..!!

Update: 2025-06-05 08:17 GMT

Kuldeep Yadav: ఘనంగా క్రికెటర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం..!!

Kuldeep Yadav: భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు అిన వంశీక ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది లఖ్నోలో జరిగిన ఎంగేజ్ మెంట్ వేడుకలో కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్లు సమాచారం.

కుల్దీప్ యాదవ్, వంశిక చిన్ననాటి స్నేహితులు. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీతో వీరి నిశ్చితార్థ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు త్వరలో ఇంగ్లండ్ తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కు కుల్దీప్ ఎంపికయ్యారు. 



Tags:    

Similar News