CSK vs KKR: చెన్నై స్టేడియంలోనే చెన్నైని చిత్తుగా ఓడించిన కేకేఆర్, పని చేయని ధోని మంత్రం

CSK vs KKR: చెన్నై స్టేడియంలోనే చెన్నైని చిత్తుగా ఓడించిన కేకేఆర్, పని చేయని ధోని మంత్రం

Update: 2025-04-11 17:15 GMT

CSK vs KKR: చెన్నై స్టేడియంలోనే చెన్నైని చిత్తుగా ఓడించిన కేకేఆర్, పని చేయని ధోని మంత్రం 

KKR strikes hard CSK: ధోని కెప్టెన్సీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. చెన్నై మరోసారి ఘోర పరాజయం పాలైంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అలా తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులే చేసింది. చెన్నై స్టేడియం వేదికగా ఆ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే.

104 పరుగుల అతి తక్కువ స్కోర్ లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు కేవలం 10.1 ఓవర్లలోనే ఘన విజయం సాధించింది.

కోల్‌కతా బౌలర్ల తాకిడికి చెన్నై బ్యాటర్లు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ దశలోనూ అసలు పోటీనే ఇవ్వలేకపోయారు. బ్యాటర్స్ స్కోర్ చేయడం కంటే వికెట్లు కాపాడుకోవడానికే ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. 

చెన్నై ఓపెనర్స్ రచిన్ రవీంద్ర (4), డెవొన్ కాన్వె (12) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. రాహుల్ త్రిపాఠి అతి కష్టం మీద 22 బంతులలో 16 పరుగులే చేశాడు.

విజయ్ శంకర్ 29 పరుగులు చేసినప్పటికీ, అందుకు 21 బంతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. శివం దూబే 29 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

విజయ్ , శివమ్ మినహాయిస్తే రవీంద్ర జడేజా, ధోని సహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ కనీసం సింగిల్ డిజిట్ కాదు కదా చెప్పుకోదగిన పరుగులు చేయలేకపోయారు. 

కోల్‌కతా బౌలర్లలో సునిల్ నరైన్ 3/13 మరోసారి తన సత్తా చాటుకున్నాడు. కేవలం బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లోనూ సునీల్ 18 బంతుల్లో 44 పరుగులు చేసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

హర్షిత్ రాణా 2/16, వరుణ్ చక్రవర్తి 2/22 తో చెన్నైని అతి తక్కువ స్కోర్ కు పరిమితం చేయడంలో విజయం సాధించారు.   

Tags:    

Similar News